గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తమ సంస్థలో శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్-3’ పూర్తి కాకుండా ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడానికి వీల్లేదంటూ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది లైకా సంస్థ.
దీంతో ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆగిపోతున్నట్లు.. తమిళ నిర్మాతల మండలి ఈ సినిమా టీంకు నోటీస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు లైకా ప్రొడక్షన్స్ సంస్థ మీద భగ్గుమన్నారు. ‘ఇండియన్-2’ ఆల్రెడీ గత ఏడాది విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-3’ మీద ఎవ్వరికీ ఆశలు లేవు.
మరోవైపు ‘ఇండియన్-2’, ‘ఇండియన్-3’ సినిమాల వల్ల ‘గేమ్ చేంజర్’ చాలా ఆలస్యం అయింది. నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. ‘గేమ్ చేంజర్’ను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ శంకర్ ‘ఇండియన్-2, 3’ సినిమాల మీద ఫోకస్ చేస్తే రామ్ చరణ్ అండ్ టీం ఓపిగ్గా ఎదురు చూసింది. అలాంటిది ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విడుదల ఆపాలని లైకా వాళ్లు నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో చరణ్ అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది.
నిజానికి ‘గేమ్ చేంజర్’ విడుదలై బాగా ఆడితే.. అది ‘ఇండియన్-3’కి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తే ‘ఇండియన్-3’కి బిజినెస్ పరంగా లాభం జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే ‘గేమ్ చేంజర్’ సరిగ్గా రిలీజై బాగా ఆడాలని కోరుకోవాలి లైకా సంస్థ. కానీ అనూహ్యంగా ‘గేమ్ చేంజర్’ తమిళ రిలీజ్ ఆపాలని డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఐతే తమిళ నిర్మాతల మండలి ‘గేమ్ చేంజర్’ రిలీజ్ ఏమీ ఆపట్లేదని.. ఈ సినిమా అనుకున్నట్లే తమిళంలో కూడా జనవరి 10నే విడుదల కాబోతోందని సమాచారం బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on January 7, 2025 10:17 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…