నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం చూసి అభిమానులు ఎంతగా మురిసిపోయారో చూశాం. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మెగాస్టార్ పాల్గొన్న మరో సందర్భం ఫ్యాన్స్ ని మరింత సంతోషంలో ముంచెత్తేలా చేసింది.
హైదరాబాద్ లో జరుగుతున్న ఆప్టా బిజినెస్ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఆహుతులతో పలు కబుర్లు పంచుకున్నారు. నేరుగా సినిమాలకు సంబంధించిన వేడుక కాకపోయినా ప్రసంగంలో వచ్చిన సందర్భానికి అనుగుణంగా ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పుకొచ్చారు.
చాలా ఏళ్ళ క్రితం పవన్ తో చిరంజీవి ఓ మాట అన్నారు. బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఫ్యామిలీ ఎలా అయితే ఒక లెగసిని సృష్టించి ఎంతో మంది స్టార్లను ఇచ్చిందో అదే తరహాలో తెలుగులో మన కుటుంబం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని అన్నారు. తర్వాత కాలం గడిచేకొద్దీ దాన్ని ఆయన మర్చిపోయారేమో కానీ పవన్ గుర్తుపెట్టుకున్నారు.
ముందు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్ అటుపై సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, నీహారిక ఇలా వరసగా తమ టాలెంట్లతో ఋజువు చేసుకున్నారు. ఇటీవలే పవన్ కలిసినప్పుడు చిరంజీవితో ఇది గుర్తు చేసి మంచి మనసుతో నువ్వు కోరుకున్నది ఇప్పుడు నెరవేరిందని సంతోషంగా చెప్పారు.
ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కపూర్స్ అఫ్ సౌత్ ఇండియా అంటూ తమ గురించి వచ్చిన ఆర్టికల్ ని ప్రస్తావించారు చిరంజీవి. ఏదైతేనేం మరో అరుదైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్న చిరు తన తమ్ముడి పేరు ఎత్తిన ప్రతిసారి ఆ సభలోనూ ఈలలు, కేకలు హోరెత్తిపోవడం విశేషం.
ప్రస్తుతం విశ్వంభర చివరి దశలో ఉన్న మెగాస్టార్ త్వరలోనే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ని ఫైనల్ చేయబోతున్నారు. అది ఓకే అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవన్నీ ఎలా ఉన్నా అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో రుజువు చేసేందుకే పలు ఈవెంట్లు వేదికగా మారడం ఫ్యాన్స్ కి మాములు సంతోషాన్ని ఇవ్వడం లేదు.
This post was last modified on January 5, 2025 10:21 pm
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…
``తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు…
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ,…