Movie News

కొండ దేవర : ఇది కదా తమన్ అసలైన జాతర!

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత ఉంది. సాంగ్స్ విపరీతంగా వైరల్ కాకపోవడం పక్కనపెడితే విజువల్ గా శంకర్ చూపించిన గ్రాండియర్, రామ్ చరణ్ స్టెప్పులు వాటిలో బలహీనతలను కవర్ చేశాయి.

తమన్ పనితనం మీద అనుమానం లేదు కానీ పోటీలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ దూసుకుపోవడం దగ్గర అసలు తంట వచ్చింది. గోదారి గట్టు మాములు వైరల్ కాలేదు. రీల్స్ లో హోరెత్తిపోయింది. అయితే అసలు తమన్ సత్తా మాత్రం వేలాది ఫ్యాన్స్ సమక్షంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది.

గీత రచయిత కాసర్ల శ్యామ్ పలు సందర్భాల్లో నొక్కి చెప్పిన ఇప్పటిదాకా విడుదల కాని రెండు పాటలు, ఒక ర్యాప్ సాంగ్ నిన్న వేదిక మీద లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా లాంచ్ చేశారు. దేనికదే క్రేజీగా ఉండటంతో వీలైనంత త్వరగా లిరికల్ వీడియోలు వదలమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఆడియో రూపంలో వివిధ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొండ దేవరకు తమన్ ఇచ్చిన బీట్స్, తప్పెట గూళ్ళు వాయించుకునే సంప్రదాయ నృత్యకారుల శైలికి అనుగుణంగా చేసిన కంపోజింగ్ ఓ రేంజ్ లో హై ఇచ్చేలా సాగింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన పాట ఇది.

దీనికన్నా ఎక్కువగా హై ఎమోషన్ లో సాగే అరుగు మీద పాట బరువైన భావోద్వేగాలను గాయని రోషిణి ద్వారా కనెక్ట్ చేస్తోంది. కొండ దేవర ఊపిస్తే నా దొరా అంటూ సాగే ఈ రెండో సాంగ్ తక్కువ వాయిద్యాలతో సున్నితంగా సాగింది. రోల్స్ రిడా రాసిన కోప్ ర్యాప్ దర్శకుడు శంకర్ వింటేజ్ మార్క్ ప్రేమికుడుని గుర్తు చేసింది.

లెంగ్త్ చిన్నదే అయినప్పటికీ మంచి కిక్ ఇచ్చేలా ఉంది. మొత్తానికి జరగండి జరగండి, రా మచ్చా రా లను మించే స్థాయిలో ఇప్పుడివి ఆకట్టుకునేలా ఉన్నాయి. వీలైనంత త్వరగా యూట్యూబ్ వీడియో వెర్షన్లు పెడితే రీచ్ భారీగా వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రెండు పాటల్లో అంజలినే ఉంటుంది.

This post was last modified on January 5, 2025 1:04 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

48 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago