సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా కావాల్సింది ఏముంటుంది. నిన్న జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ జనసేనను నడిపేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో వకీల్ సాబ్ చేయడం కోసం ఇచ్చిన పారితోషికం ఇంధనంలా పని చేసిందని చెప్పడంతో దిల్ రాజు గారి ఆనందం అంతా ఇంతా కాదు.
ఆయన తొలిప్రేమని డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాన్ని పవన్ గుర్తు చేసుకోవడం విశేషం. నిజానికి గేమ్ ఛేంజర్ నిర్మాతగా ఆయనకిది ఊహించని పొగడ్తని చెప్పాలి.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎంత వాస్తవముందో అర్థమవుతుంది. అజ్ఞాతవాసి తర్వాత ఇకపై సినిమాలు చేయనని ప్రకటించిన పవన్ కళ్యాణ్ నిజంగానే మానేశారు. అయితే 2014లో జనసేన ఓటమి ఆర్థిక మూలలను దెబ్బ కొట్టింది. తిరిగి కోలుకోవాలంటే మళ్ళీ సంపాదించక తప్పని పరిస్థితి నెలకొంది.
అడిగితే అన్నయ్య ఆర్థికంగా అండగా ఉంటాడు కానీ పవన్ వ్యక్తిత్వం అందుకు ఒప్పుకోదు కాబట్టి మళ్ళీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు వేగంగా తీయగలిగే కథ కోసం చూస్తూ పింక్ రీమేక్ ఆలోచన చేయడం, వేణు శ్రీరామ్ బరిలో దిగడం జరిగిపోయాయి.
వకీల్ సాబ్ వందల వేల కోట్లు వసూలు చేసిన బాహుబలి రేంజ్ కాదు కానీ దానికైన బడ్జెట్, జరిగిన బిజినెస్, రికవరీ కోణంలో సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ మరింత హుషారుగా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసే దిశగా భీమ్లా నాయక్, బ్రో ఎంచుకోవడానికి ప్రేరేపించింది.
వకీల్ సాబ్ ఎంత రీమేకే అయినా అందులో పవన్ స్వాగ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఫ్యాన్స్ విపరీతంగా ఇష్టపడతారు. వకీల్ సాబ్ 2 చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన దిల్ రాజు దగ్గర ఉంది కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ చూస్తుంటే ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో అనుమానమే.
This post was last modified on January 5, 2025 12:06 pm
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…