పారితోషికాలు తీసుకుని సినిమాల్లో నటించేస్తారు కానీ చాలా మంది ఆర్టిస్టులు ప్రమోషన్లంటే మాత్రం అదేదో తమ బాధ్యత కాదన్నట్టు దూరంగా ఉంటారు. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే ఎన్ని కోట్లిచ్చినా ప్రీ రిలీజ్ పబ్లిసిటీకి మాత్రం ససేమిరా అంటుంది. ఒకవేళ అడిగినా ఇది నా పద్దతంటూ, ఇలాగే ఉంటానంటూ సమాధానం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడ్ యాక్టర్స్ ప్రచారంలో భాగమైతేనే మూవీని జనాలకు మరింత దగ్గర చేయగలం. ఈ మార్కెటింగ్ సూత్రాన్ని ఆణువణువూ వంటబట్టించుకోబట్టే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీ స్టారర్ కు సైతం రాజమౌళి ఇద్దరు హీరోలను పట్టుకుని దేశవిదేశాలు తిరిగి వచ్చాడు.
ఈ సందర్భంలో ఎస్జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇతర భాషల్లో సినిమాలు చేసినా సరే ప్రమోషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయడం లేదు. గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. లోకల్ కాబట్టి చెన్నైలో పాల్గొన్నాడు. వెళ్లకపోయినా పెద్ద నష్టం లేదు కానీ శ్రమకోర్చి ముంబై వెళ్ళాడు.
శంకర్ లేడు కానీ ఎస్జె సూర్య ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్నాడు. తర్వాత బెంగళూరు ట్రిప్ ఉంది. ఏ చోటికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడుతూ మీడియాకు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. అలాని ఎస్జె సూర్య డేట్లు దొరికేంత ఖాళీగా అయితే లేడు. రెండేళ్ల డైరీ బిజీగా ఉంది.
ఇప్పుడే కాదు గత ఏడాది సరిపోదా శనివారం కోసం కూడా ఎస్జె సూర్య ఇదే తరహాలో నాని, వివేక్ ఆత్రేయతో కలిసి ప్రమోషన్లలో ముందున్నాడు. చేతిలో ఏడెనిమిది సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ విలక్షణ నటుడు ఇంత ఓపిగ్గా తిరగడం చూస్తే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా తప్పు లేదనేది నిర్మాతల భావన.
పెర్ఫార్మన్స్ తో పాత్రను నిలబెట్టడం, స్వంతంగా డబ్బింగ్ చెప్పడం లాంటి లక్షణాలు దర్శకులకు బెస్ట్ ఛాయస్ గా మారుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు రెండు దశాబ్దాల తర్వాత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా మారిపోవడం మంచి ప్రయాణానికి ఉదాహరణ.
This post was last modified on January 4, 2025 5:36 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…