ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత శ్రీదేవికి ఎంత పెద్ద వీరాభిమానో తెలిసిందే. శివ తర్వాత కేవలం తన అభిమాన నటి కోసం క్షణ క్షణం రాసుకుని ఈ సినిమా ఆమెకు రాసిన ప్రేమలేఖని గర్వంగా చెప్పుకున్నారు. అందుకే అందులో వెంకటేష్ ఎంట్రీ ఆలస్యంగా అరగంట తర్వాత ఉంటుందని, అప్పటిదాకా శ్రీదేవినే హైలైట్ చేశారనే కామెంట్స్ పత్రికల్లో వచ్చాయి.
తర్వాత వర్మ గోవిందా గోవిందా చేశారు కానీ అది ఫ్లాపయ్యాక తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు. అంతగా ఆరాధించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మీద ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజం.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భం వస్తే నిర్మొహమాటంగా శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఒకవేళ అవకాశం వచ్చినా తనతో ఇప్పట్లో సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పారు. సరే వర్మ అనుకోవడం ఏమిటో కానీ అసలు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే గతాన్ని పక్కనపెడితే ఇప్పుడీ విలక్షణ దర్శకుడి ట్రాక్ రికార్డు అస్సలు బాలేదు.
రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ ఎజెండాతో సినిమాలు తీయడం మొదలుపెట్టాక వింటేజ్ ఇమేజ్ పోయింది. పాత క్లాసిక్స్ ని చూసుకుని మురిసిపోవడం తప్ప ప్రత్యేకంగా వర్మ తీసే కొత్త చిత్రాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ తగ్గిపోయారు.
అన్నట్టు వర్మ మాస్టర్ పీస్ సత్య ఈ నెల 17 థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. రీ మాస్టర్ చేసిన సరికొత్త ప్రింట్ తో కొత్తగా తీసుకొస్తున్నారు. దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ కి మంచి వసూళ్లు వస్తాయనే అంచనా ఉంది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్ లకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సత్య కమర్షియల్ గానూ అద్భుతాలు చేసింది.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. జెడి, ఊర్మిళ, మనోజ్ తో పాటు నటించిన, పని చేసిన టీమ్ దాదాపుగా అందుబాటులోనే ఉంది. వాళ్ళందరిని ఇందులో భాగం చేయబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ గర్వంగా చెప్పుకునే గత జ్ఞాపకాల్లో సత్యది ప్రత్యేక స్థానం మరి.
This post was last modified on January 4, 2025 3:41 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…