ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది. దర్శకుడు శంకర్ బ్రాండ్ తో పాటు పొంగల్ బరిలో ఇది తప్ప చెప్పుకోదగ్గ ప్యాన్ ఇండియా మూవీ వేరేది లేకపోవడంతో మీడియా అటెన్షన్ దీనివైపు బాగానే ఉంది. దానికి తోడు నిర్మాత దిల్ రాజు చెన్నైలో ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా రజనీకాంత్, విజయ్ ను ఆహ్వానించారని వస్తున్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. వీళ్లిద్దరిలో ఒక్కరు వచ్చినా అదిచ్చే బూస్ట్ మాములుగా ఉండదు. అయితే ఖరారుగా తెలియాలంటే ఇంకొంచెం ఆగాలి. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ టాపిక్ ఉంది.
గేమ్ ఛేంజర్ కథకు ముందు శంకర్ అనుకున్న హీరో విజయ్. కానీ కుదరలేదు. ఈ కాంబోలో 3 ఇడియట్స్ రీమేక్ నన్బన్ (స్నేహితుడు) వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. ఆ టైంలోనే కార్తీక్ సుబ్బరాజ్ ఒక కథ రాసుకుని శంకర్ కు వినిపించడం, అది కాస్తా తలపతికి చేరడం జరిగిపోయాయి. స్టోరీ నచ్చినా కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీని స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు. అలా చేయి మారిపోయి దిల్ రాజు ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం, వెంటనే ఎస్ చెప్పించుకోవడం జరిగాయి.
ఇదంతా విశ్వసనీయ తమిళ మీడియాలో వచ్చిన కథనమే. ఒకవేళ విజయ్ కనక గేమ్ ఛేంజర్ చేసి రాజకీయ తెరంగేట్రానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయేది. కానీ జరిగింది వేరు. మూడేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి విజయ్ అంత సమయం కేటాయించే వాడు కాదు కానీ ఇండియన్ 2 వల్ల వచ్చిన అడ్డంకులు లేట్ చేశాయి తప్పించి మాములుగా అయితే శంకర్ టార్గెట్ రెండు సంవత్సరాలలోపే రిలీజ్ చేయాలని. అజిత్ విడాముయార్చి వాయిదా పడటం వల్ల ఆ ఆనందంతో విజయ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కు పూర్తి మద్దతు ఇస్తున్న వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది.
This post was last modified on January 3, 2025 11:20 am
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…