గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఖరారు కావడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత బాబాయ్ అబ్బాయ్ కాంబో చూసే ఛాన్స్ దక్కడంతో పాసుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనవరి 4 రాజమండ్రిలో ప్లాన్ చేశారనే విశ్వసనీయ సమాచారం తప్ప ఎక్కడ ఎప్పుడు లాంటి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజుకి ఏ డేట్ ఇచ్చారనేది ఎస్విసి టీమ్ సస్పెన్స్ గానే ఉంచినప్పటికీ వైరల్ అవుతున్న వార్త నమ్మశక్యంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రావొచ్చనే ప్రచారం ఉదయం దాకా జరిగింది.
తాజా అప్డేట్ ఏంటంటే చిరు ఈ వేడుకకు వచ్చే అవకాశం లేనట్టే. జనవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్ లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించే కాటలిస్ట్ ప్రోగ్రాంకు ఆయనే చీఫ్ గెస్ట్. ఆ మేరకు ఒక వీడియో సందేశం కూడా స్వయంగా చిరంజీవే విడుదల చేశారు. ఒక రోజు వెళ్తారా లేక రెండు రోజులా అనేది తెలియలేదు కానీ మొత్తానికి ఈ ఈవెంట్ కి ప్రాధాన్యం ఇస్తున్న విషయం తేటతెల్లమయ్యింది. ఒకరకంగా ఇదే మంచిది. ఎందుకంటే పవన్, చరణ్ ఇద్దరినీ చూసేందుకే అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు. అలాంటిది చిరు కూడా తోడైతే వాళ్ళను కంట్రోల్ చేయడం కష్టం.
ఇది కొంచెం నిరాశపరిచే వార్తే అయినా పాజిటివ్ యాంగిల్ లో చూసుకుంటే సరైన నిర్ణయమేనని చెప్పాలి. నిర్మాత దిల్ రాజు అనుమతి దొరకడం ఆలస్యం వెంటనే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అమెరికా, విజయవాడలో జరిగిన ఈవెంట్లు బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో వాటిని మించే రీతిలో తన ఫంక్షన్ జరగాలి. దానికి అనుగుణంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబో రెడీ అవుతోంది. దర్శకుడు శంకర్, ఎస్జె సూర్య తదితరులతో పాటు హీరోయిన్ కియారా అద్వానీ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యూజికల్ కాన్సర్ట్ ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ రెండు సినిమాలతో బిజీగా ఉన్న తమన్ దానికి ప్లాన్ చేసుకుంటాడో లేదో చూడాలి.