హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుప్రసిద్ధ సంధ్య 70 ఎంఎం థియేటర్ లో 23 సంవత్సరాలు భద్రంగా ఉన్న రికార్డుని పుష్ప 2 ది రూల్ దాటేసింది. నాలుగు వారాలు తిరక్కుండానే 1 కోటి 59 లక్షలకు పైగా వసూలు చేసి సరికొత్త మైలురాయి నమోదు చేసింది. ఇప్పటిదాకా ఈ ఘనత 2001లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషి మీద ఉంది. ఆ టైంలో అది కలెక్ట్ చేసిన మొత్తం 1 కోటి 53 లక్షలు. పుష్ప 2 దాటేసింది కానీ ఖుషి స్పెషలని చెప్పడానికి కారణాలున్నాయి. అప్పట్లో నేల క్లాసు నుంచి బాల్కనీ దాకా టికెట్ రేట్లు 5 నుంచి 50 రూపాయల మధ్యలో ఉండేవి. ప్రీమియర్లకు ఎక్స్ ట్రా ధరలు, ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు ఏం లేవు. బ్లాక్ టికెట్ల దందా నడిచేది కానీ అదంతా అఫీషియల్ కలెక్షన్ లో కలిసేది కాదు కాబట్టి కౌంట్ చేయరు.
పుష్ప 2 లెక్కలు వేరు. బెనిఫిట్ షో 900 రూపాయలకు అమ్మారు. వారం రోజులకు పైగా ఫస్ట్ క్లాస్ 250 రూపాయల మీద హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆ తర్వాత 175తో కొనసాగుతోంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే రికార్డులు ఉండేది బద్దలు కొట్టేందుకే అని అల్లు అర్జున్ అన్నట్టు ఇదంతా మాములే కానీ ఖుషిని దాటేందుకు రెండు దశాబ్దాలకు పైగా టైం పట్టడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. సంధ్య 70 ఎంఎంని మెగా కంచుకోటగా, పవన్ కళ్యాణ్ అడ్డాగా ఫ్యాన్స్ భావిస్తారు. అలాంటి చోటే పుష్ప 2 జెండా పాతింది. ఇంకా రన్ ఉంది కనక ఫైనల్ ఫిగర్ షాకిచ్చేది వస్తుంది.
లవకుశతో మొదలుపెట్టి అడవిరాముడు, ఘరానా మొగుడు, చంటి, శివ, సమరసింహారెడ్డి ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్లు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనతలు ఇప్పటి ప్యాన్ ఇండియా మూవీస్ సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నాయి. అప్పట్లోలా ఏడాది పొడవునా ఆడే అవకాశాలు లేనప్పటికీ కలెక్షన్ల విషయంలో దేశమంతా మాట్లాడుకునే స్థాయిలో బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. హిందీ రాష్ట్రాల్లో పుష్ప 2 సాధించిన విజయమే దానికి నిదర్శనం. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది బాహుబలే అయినా దాన్ని దాటేందుకు ఇప్పటి హీరోలు పోటీ పడటం శుభ పరిణామం. దానికి తగ్గట్టే బడ్జెట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి.
This post was last modified on December 30, 2024 3:09 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…