మాములుగానే రష్మిక మందన్న హైపర్ యాక్టివ్ గా మాట్లాడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేక మరో వేదిక అయినా తన మాటతీరు అంతే. ఇటీవలే ఒక బాలీవుడ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవల్లీ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ తనకు బాగా ఇష్టమైన సినిమా గిల్లి అని చెబుతూ మొదటిసారి థియేటర్లో చూసిన ఫస్ట్ హీరో తలపతి విజయ్ కావడం వల్ల అతను ఎప్పటికీ ఫెవరెట్ గా మారిపోయాడని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా ఇది పోకిరి రీమేకనే విషయం ఆలస్యంగా తెలిసిందని అనేసింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ అసలు గిల్లి ఒరిజినల్ పోకిరి కాదు ఒక్కడు.
దెబ్బకు ఆ వీడియో క్లిప్ వైరల్ అయిపోయింది. ఎంత విజయ్ అంటే ఇష్టమున్నా మరీ ఒక్కడు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్స్ గురించి తెలియదన్నట్టు మాట్లాడ్డం ఏమిటని మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకింత గట్టిగానే కస్సుమన్నారు. సరిలేరు నీకెవ్వరులో కలిసిన నటించిన సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇలా సినిమాల గురించి తప్పుగా పలకడం ఏమిటనేది వాళ్ళ వెర్షన్. ఇది వెంటనే గుర్తించిన రష్మిక సరదాగా సారీ చెప్పేసి తనకు వాళ్ళ మూవీస్ అన్నీ ఇష్టమేనని, ఏదో ఫ్లోలో పొరపాటుగా అలా వచ్చేసిందని వివరణ ఇచ్చింది. దీనికి ఫ్యాన్స్ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.
ఒక చిన్న క్లిప్పు ఇంత దూరం వెళ్లిందన్న మాట. పుష్ప 2 ది రూల్ ఇండస్ట్రీ హిట్ ని ఎంజాయ్ చేసిన రష్మిక మందన్న వచ్చే నెల విక్కీ కౌశల్ చావాలో కనిపించనుంది. దీని మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే ఆరేడు నెలల్లో అరడజను రిలీజులతో రష్మిక మాములు బిజీగా లేదు. గత ఏడాది డిసెంబర్ లో యానిమల్ తర్వాత సంవత్సరం గ్యాప్ తర్వాత పుష్ప 2తో పలకరించింది. ఇకపై నాన్ స్టాప్ గా అలరించనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన సికందర్ లో ఛాన్స్ కొట్టేయడం పట్ల అమ్మడు చాలా హ్యాపీగా ఉంది. ఇంత దివ్యమైన ట్రాక్ రికార్డు ఉన్న టాప్ హీరోయిన్ ప్రస్తుతం రష్మిక మందన్న ఒక్కర్తే.
This post was last modified on December 21, 2024 12:59 pm
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి…
హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా…
ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు.…
వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు,…
ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…