పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్ దాటిన ఇండియన్ మూవీగా మరో మైలురాయి అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు. వచ్చే వారం రిలీజ్ కానున్న బేబీ జాన్ కన్నా బన్నీ మూవీకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం గమనించాల్సిన విషయం. బాలీవుడ్ నుంచి 600 కోట్ల మార్కుని దాటేసి ఏకంగా షారుఖ్ ఖాన్ ని సవాల్ చేసిన అల్లు అర్జున్ ఫైనల్ రన్ ఎక్కడ ఆపుతాడో అంతు చిక్కడం లేదు. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది.
మొత్తం రన్ పూర్తయ్యేసరికి పుష్ప 2 రెండు వేల కోట్లను సాధిస్తాడా లేదాని. జోరు చూస్తుంటే అదేం కష్టం కాదు కానీ మరీ ఈజీ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇంకో 500 కోట్లు రావాలంటే అనూహ్యమైన పికప్ ఉండాలి. ఇప్పటికే అధిక శాతం ఆడియన్స్ థియేటర్లలో చూసేశారు. టికెట్ రేట్లు సాధారణం అయ్యాయి కాబట్టి ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకోవచ్చేమో కానీ ఇంకా చూడని జనాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టి టార్గెట్ ఆధారపడి ఉంటుంది. పైగా క్రిస్మస్ సందర్భంగా నాలుగు భాషల్లో మూకుమ్మడిగా వస్తున్న కొత్త సినిమాలు ఖచ్చితంగా పుష్ప 2 మీద ప్రభావం చూపిస్తాయి. వాటికొచ్చే టాక్ కీలకం కానుంది.
ఒకవేళ కొత్త సినిమాల్లో ఏదైనా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చెప్పలేం కానీ లేదంటే పుష్ప 2 లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. రెండో వారం నుంచి ప్రమోషన్లు ఫ్రెష్ గా చేద్దామని ప్లాన్ చేసుకున్న మైత్రి బృందానికి సంధ్య థియేటర్ దుర్ఘటన స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. బెంగళూరు, హైదరాబాద్ తదితర చోట్ల చేయాలనుకున్న సక్సెస్ ఈవెంట్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బన్నీ అరెస్ట్ జరగకపోయి ఉంటే మరో రౌండ్ ప్యాన్ ఇండియా ప్రమోషన్లకు అవకాశముండేది.
ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన ఘనవిజయం మాములుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. మైత్రి అధికారికంగా వదిలిన 1508 కోట్ల పోస్టర్ లో బన్నీతో సమానంగా దర్శకుడు సుకుమార్ ని కూడా పొందుపరిచారు. క్రెడిట్ ఇవ్వడమంటే ఇదే కదా.
This post was last modified on December 19, 2024 8:32 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…