Movie News

బచ్చలమల్లి: అల్లరోడికి అడ్వాంటేజ్!

క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ మారిపోతోంది. ముందు ఈ పండక్కి అనుకున్న ‘తండేల్’ సినిమా వాయిదా పడిపోయింది. ఒక దశలో ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్‌కే వస్తుందన్నారు. అది సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇక లేటెస్ట్‌గా మరో క్రేజీ మూవీ రేసు నుంచి తప్పుకుంది. అదే.. రాబిన్ హుడ్. కొన్ని రోజుల ముందు వరకు క్రిస్మస్ రిలీజ్ డేట్‌కే కట్టుబడి ఉన్న ఈ చిత్రాన్ని తాజాగా పోటీ నుంచి తప్పించారు. ‘పుష్ప-2’ నిర్మాతలే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయగా.. పుష్ప-2కు క్రిస్మస్ సెలవుల్లోనూ మంచి ఆక్యుపెన్సీలు వస్తాయన్న ఉద్దేశంతో దానికి పోటీగా తమ బేనర్ నుంచి మరో సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇవి కాక ప్రియదర్శి-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘సారంగపాణి జాతకం’ కూడా ఏవో కారణాలతో పోటీ నుంచి తప్పుకుంది. ఇలా తెలుగు నుంచి ఒక్కో క్రేజీ సినిమా పోటీ నుంచి తప్పుకున్నాయి . దీంతో లేటుగా క్రిస్మస్ రేసులోకి అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ మాత్రమే పోటీలో నిలిచింది. క్రిస్మస్ వీకెండ్లో రానున్న మిగతా చిత్రాలన్నీ డబ్బింగ్‌వే. ఉపేంద్ర ‘యుఐ’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముషాసా’ కూడా మంచి అంచనాలతోనే రిలీజవుతున్నప్పటికీ.. తెలుగు సినిమా కావడం ‘బచ్చలమల్లి’కి అడ్వాంటేజ్.

ఈ సినిమా ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు మంచి బజ్ వచ్చింది. కాబట్టి క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్లో ఈ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్లే. ఇది బచ్చలమల్లి అనే నిజ జీవిత వ్యక్తి కథ కావడం విశేషం. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసిన అల్లరోడు.. ఇంత వైల్డ్ క్యారెక్టర్ చేయడం అనూహ్యం. సాయిధరమ్ తేజ్‌తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తీసిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఇందులో నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. ఈ నెల 20న సినిమా రిలీజవుతుండగా.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on December 16, 2024 5:38 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..

తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…

1 minute ago

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

2 hours ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

6 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

8 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

9 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

10 hours ago