వెయ్యి కోట్ల గ్రాస్ తో టాలీవుడ్ జెండాని మరోసారి గర్వంగా పాతిన పుష్ప 2 ది రూల్ తర్వాత రెండు వారాల గ్యాప్ వస్తోంది. కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ తప్పుకోవడం దాదాపు ఖరారైపోవడంతో అల్లరి నరేష్ బచ్చల మల్లికి మంచి ఛాన్స్ దొరికింది. పోటీలో విడుదల పార్ట్ 2, యుఐ, మ్యాక్స్, ముఫాసా లాంటి డబ్బింగ్ సినిమాలున్నప్పటికీ తెలుగు నుంచి స్ట్రెయిట్ గా వస్తున్న వాటిలో బచ్చల మల్లికే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ట్రైలర్ మీదుంది. న్యాచురల్ స్టార్ నాని అతిథిగా ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. కథను బాగానే రివీల్ చేశారు.
ఒళ్ళంతా పొగరు, నిర్లక్ష్యం ఉన్న మల్లిగాడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. చెడు అలవాట్లు ఉంటే మానుకోమని హితవు చెబుతుంది. సరేనంటాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఆ అమ్మడి వెనుక ఎంత బలమైన నేపథ్యం ఉందో మల్లి చూసుకోడు. తేడా వస్తే అవతలోడి తల పగలగొట్టేందుకు వెనుకాడని మల్లికి అనుకోని ప్రమాదాలు స్వాగతం చెబుతాయి. శత్రువులు కవ్విస్తారు. మరి దూసుకుపోయే మనస్తత్వాన్ని పక్కనపెట్టి ప్రియురాలిని ఎలా గెలుచుకున్నాడనేది అసలు స్టోరీ. మెయిన్ పాయింట్ మరీ కొత్తగా అనిపించకపోయినా మాస్ ట్రీట్ మెంట్ అంచనాలు, ఆసక్తి పెంచేలా ఉంది.
ముఖ్యంగా అల్లరి నరేష్ మేకోవర్ చూస్తుంటే తనలో ఇంత వయొలెంట్ యాంగిల్ ఉందా అని ఆశ్చర్యం కలగకమానదు. బచ్చల మల్లికి ఇది గొప్ప అవకాశం. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా దాకా తిరుగుండదు. ఎలాగూ ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు, అగ్రెసివ్ గా అనిపించే హీరోయిజం అన్ని పుష్కలంగా దట్టించారు కాబట్టి కంటెంట్ కనెక్ట్ అయితే హిట్టు కొట్టడం ఖాయం. కామెడీ జానర్ అంతగా వర్కౌట్ కాకపోవడంతో అల్లరోడు పూర్తిగా సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయిపోయాడు. నాంది సక్సెసయ్యింది కానీ ఉగ్రం లాంటివి ఫలితం ఇవ్వలేదు. బచ్చల మల్లి సరికొత్త ఇమేజ్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on December 14, 2024 5:44 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…