ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్న తరుణంలో బేబీ జాన్ ప్రమోషన్ ఈవెంట్లో హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు దాన్ని ఒకే వ్యక్తిపై నెట్టకూడదని, రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థదని, చుట్టూ ఉన్న వాళ్లకు జాగ్రత్తలు చెప్పడం తప్ప మనమేం చేయగలమని అన్నాడు. చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉందని, వాళ్లకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పిన వరుణ్ ధావన్ ప్రాక్టికల్ గా మాట్లాడాడు.
నిజానికి ఇలాంటివి జరగడం కొత్త కాదు. గతంలో థియేటర్ల దగ్గర కటవుట్లు కడుతున్నప్పుడు, బ్యానర్లు అలంకరిస్తున్నప్పుడు ఫ్యాన్స్ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లకు డబ్బు రూపంలో పరిహారం అందజేసిన హీరోలు టాలీవుడ్ లోనే ఎక్కువ. కానీ పుష్ప 2 మీద విపరీతమైన ఫోకస్ ఉన్న టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జాతీయ స్థాయిలో టాపిక్ గా మారిపోయింది. దానికి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని తెలిసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. హీరో వస్తున్నాడని రెండు రోజుల ముందే పోలీసులను సెక్యూరిటీ అడిగిన థియేటర్ యాజమాన్యం లెటర్ తాజాగా బయటికొచ్చింది.
తేరి రీమేక్ గా రూపొందిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ ధావన్ పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. పుష్ప 2 హ్యాంగోవర్ లో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ ని దీనివైపు తిప్పడం పెద్ద సవాల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది కూడా ఫుల్ మాస్ కంటెంట్ ఉన్న మసాలా మూవీ. తెరీ ని మించి హీరోయిజమ్, విలన్ ట్రాక్ ని జోడించారు. కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం మీద మంచి బజ్ ఏర్పడుతోంది. దీన్ని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 13, 2024 4:13 pm
వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జమిలి…
మంచు వారి కుటుంబ గొడవ కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుండగా.. మళ్లీ ఓ వివాదంతో ఆ ఫ్యామిలీ వార్తల్లోకి వచ్చింది. తన…
ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అడ్డుకోలేదు. వారికి ఎక్కడా.. బ్రేకులు వేయలేదు.…
వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన మకాం మార్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయం.. ఒంగోలు…
తమిళ హీరో విజయ్ సేతుపతి మనకు బాగా దగ్గరయ్యింది ఉప్పెన నుంచే. కృతి శెట్టి తండ్రి రాయణం పాత్రలో చూపించిన…