భారీ అంచనాల మధ్య ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు తొలి వారం అంచనాలను మించే వసూళ్లు వచ్చాయి. అప్పుడే పుష్ప-2 వరల్డ్ వైడ్ వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మరి ఈ వారంలో ఎక్కడ ఎంత మేర కలెక్షన్లు రాబట్టిందో ఓ లుక్కేద్దాం పదండి.తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే ‘పుష్ప-2’ తొలి వారంలో రూ.145 కోట్ల దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ వసూళ్లు రూ.220 కోట్ల మేర ఉన్నాయి.
ఇందులో నైజాం (తెలంగాణ) వరకు గ్రాస్ రూ.100 కోట్ల మార్కును దాటేయడం విశేషం. షేర్ రూ.65 కోట్లు దాటింది. సీడెడ్లో రూ.33 కోట్ల గ్రాస్.. రూ.25 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్రలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపితే గ్రాస్ రూ.90 కోట్లకు చేరువగా ఉంది. షేర్ 55 కోట్ల దాకా ఉంది. దక్షిణాదిన కేరళ మినహా అన్ని చోట్లా ‘పుష్ప-2’ అదరగొడుతోంది. కర్ణాటకలో రూ.70 కోట్లకు పైగా గ్రాస్, 36 కోట్లను మించి షేర్ వచ్చాయి. తమిళనాట ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండడం విశేషం. షేర్ రూ.22 కోట్ల దాకా వచ్చింది. కేరళలో అండర్ పెర్ఫామ్ చేస్తున్న పుష్ప-2 15 కోట్ల గ్రాస్, రూ.6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిందీ చిత్రం.
నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ మోత మామూలుగా లేదు. హిందీలో ఇప్పటికే గ్రాస్ రూ.440 కోట్ల దాకా వచ్చింది. షేర్ రూ.200 కోట్లకు చేరువగా ఉంది. యుఎస్‌లో ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తుండడం విశేషం. షేర్ రూ.50 కోట్లకు దగ్గర ఉంది. మిగతా దేశాల్లో కూడా పుష్ప-2 గ్రాస్ వసూళ్లు వంద కోట్లకు చేరువగా ఉన్నాయి. మొత్తంగా ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మేర గ్రాస్.. రూ.480 కోట్ల దాకా షేర్ రాబట్టింది ఈ చిత్రం.
This post was last modified on December 13, 2024 12:51 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……