Movie News

స్పిరిట్ గురించి తొందరెందుకు డార్లింగ్స్…

ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనేది పాత సామెత. అయినా సరే ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ ఒక ఆన్ లైన్ డిస్కషన్ ప్లాట్ ఫార్మ్ నుంచి తీసుకున్న పాయింట్ తో ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ చర్చలు చేస్తున్నారు. పోయిన తన ఉద్యోగం రాబట్టుకోవడం కోసం ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ క్రూరమైన ఇంటర్నేషనల్ ముఠా అంతు చూస్తాడనే కథతో సందీప్ రెడ్డి వంగా మెంటల్ ఎక్కిస్తాడట. నిజానికి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ తో గతంలో కొన్ని వందల సినిమాలు వచ్చాయి.

కానీ సందీప్ వంగా ఆలోచనలు అంత రొటీన్ గా ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో థియేటర్ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తాడు. దాయాది అన్నదమ్ముల మధ్య యుద్ధాన్ని తండ్రి సెంటిమెంట్ కి ముడిపెట్టి వయొలెంట్ గా చూపించిన తీరు యానిమల్ ని బ్లాక్ బస్టర్ చేసింది. స్పిరిట్ కూడా అదే తరహాలో ఊహించని ట్రీట్ మెంట్ తో ఉంటుంది. సో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న కథ నిజమైనా కాకపోయినా స్పిరిట్ గురించి ఇంత త్వరగా డిస్కషన్లు మాత్రం తొందరపాటే. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం సీరియస్ గా ఫోకస్ చేసిన ప్యాన్ ఇండియా సినిమాలు రెండు. ఒకటి ఫౌజీ, రెండోది ది రాజా సాబ్.

ముందు ఇవి రిలీజవుతాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటే బెటరని ఇతర ఫ్యాన్స్ అభిప్రాయం. ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తుందో రాదోననే అనుమానాల నేపథ్యంలో ఒకవేళ అది కనక వాయిదా పడితే వేసవి బదులు దసరాకో దీపావళికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఫౌజి 2026కి షిఫ్ట్ అవుతుంది. స్పిరిట్ ని వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టినా పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. సందీప్ వంగా పర్ఫెక్షన్ కోసం సమయాన్ని పట్టించుకోడనే సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని సలార్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2ల గురించి కూడా ట్రెండింగ్ జరగడం గమనార్హం.

This post was last modified on December 12, 2024 5:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రూ.500లతో కోటీశ్వరుడుగా మారిన లారీ డ్రైవర్!!

నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…

7 hours ago

దావోస్ లో తెలంగాణకు తొలి పెట్టుబడి వచ్చేసింది!

పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…

8 hours ago

‘గాజు గ్లాసు’ ఇకపై జనసేనది మాత్రమే!

ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…

9 hours ago

రజినీ కే కాదు, బాలయ్య కి కూడా అనిరుధ్ మ్యూజిక్

2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…

9 hours ago

పవన్ వస్తున్నప్పుడు… ‘వీరమల్లు’ ఎందుకు రాడు?

గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…

9 hours ago

నాటి నా విజన్ తో నేడు అద్భుత ఫలితాలు: చంద్రబాబు

టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……

9 hours ago