Movie News

వెయ్యి కోట్ల సింహాసనం – పుష్ప 2 విజయగర్వం

డిసెంబర్ 5 విడుదల తేదీకి ముందు ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రచారాలు. ఒక కమర్షియల్ సినిమా సీక్వెల్ ఇంత బడ్జెట్ తో తీస్తే వర్కౌట్ అవుతుందా అని ఒకరు. అధిక శాతం మెగా ఫ్యాన్స్ సానుకూలంగా లేరు కాబట్టి వసూళ్ల మీద ప్రభావముంటుందని మరొకరు. అసలు బీహార్ వెళ్లి ఈవెంట్ చేస్తే హైప్ వస్తుందా అని ఇంకొందరు. మూడేళ్ళ సమయానికి న్యాయం జరుగుతుందా అని వేరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 ది రూల్ రాకముందు ఎన్నెన్నో అనుమానాలు. కానీ ఈ ప్రచారమంతా గాలి బుడగేనని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే తేటతెల్లమయ్యింది. కట్ చేస్తే వారం తిరక్కుండానే వెయ్యి కోట్ల గ్రాస్ దాటేసి పుష్ప 2 విజయగర్వంతో నిలిచింది.

ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ అందుకున్న తొలి సినిమాగా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ఈ విషయంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటివాటిని దాటేయడం అరుదైన ఘనత. ఊహించని స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో బన్నీ సాగించిన వసూళ్ల విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటిరోజు షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డునే దులిపేయడం మాములు విషయం కాదు. ముంబై, రాయ్ గడ్, పాట్నా ఇలా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో అదిరిపోతున్న పబ్లిక్ టాక్ తో పుష్ప 2 దూసుకుపోయిన వైనం చూసి తలలు పండిన ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టిన వైనం వాళ్ళ రిపోర్ట్స్ లో కనిపించింది.

కేవలం ఆరు రోజులకే ఈ ఫీట్ సాధించడం చాలా రోజులు గుర్తుండిపోతుంది. దగ్గర్లో గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా రిలీజులు ఉన్నప్పటికీ పుష్ప 2ని దాటడం అంత సులభంగా ఉండదు. పుష్ప 3 ఉంటుందో లేదో ఖరారుగా తెలియకుండానే దాని కోసం ఎదురు చూస్తున్నామని హిందీ ఫ్యాన్స్ ఊగిపోతూ చెప్పడం పుష్పరాజ్ క్రేజ్ కు నిదర్శనం. టికెట్ రేట్లు ఈ వసూళ్లకు దోహదం చేసినా ఒకవేళ టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా అదే శాపంగా మారేది. కానీ ప్రతి పైసాకు కంటెంట్ న్యాయం చేకూర్చడంతో ప్రేక్షకులు ఫిర్యాదు చేయలేదు. గంగమ్మ జాతరలోనే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా పుష్పరాజ్ తాండవం మాములుగా లేదు.

This post was last modified on December 11, 2024 12:39 pm

Share
Show comments

Recent Posts

రూ.500లతో కోటీశ్వరుడుగా మారిన లారీ డ్రైవర్!!

నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…

7 hours ago

దావోస్ లో తెలంగాణకు తొలి పెట్టుబడి వచ్చేసింది!

పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…

9 hours ago

‘గాజు గ్లాసు’ ఇకపై జనసేనది మాత్రమే!

ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…

9 hours ago

రజినీ కే కాదు, బాలయ్య కి కూడా అనిరుధ్ మ్యూజిక్

2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…

9 hours ago

పవన్ వస్తున్నప్పుడు… ‘వీరమల్లు’ ఎందుకు రాడు?

గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…

9 hours ago

నాటి నా విజన్ తో నేడు అద్భుత ఫలితాలు: చంద్రబాబు

టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……

10 hours ago