Movie News

త్రివిక్రమ్ బాధ్యత మరింత పెరిగింది

మాటల మాంత్రికుడు కం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీ తీయలేదు. రాజమౌళి, సుకుమార్ ల సరసన నిలుస్తున్నా సరే ఆయన పేరు ఇంకా హిందీ మార్కెట్ దాకా రీచ్ కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఆ అవకాశం ఇస్తోంది. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబోనో చెప్పనక్కర్లేదు. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. అల వైకుంఠపురములో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించింది. ఇప్పుడు నాలుగో సారి ఈ కాంబో చేతులు కలపబోతోంది. ఈసారి త్రివిక్రమ్ బాధ్యత చాలా అంటే చాలా పెరగనుంది. ఎలాగో చూద్దాం.

పుష్ప 2 ది రూల్ బాలీవుడ్ రికార్డుల బూజు దులిపాక బన్నీకి నేషన్ వైడ్ ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ సినిమా అయినా సరే దాన్ని ఒకేసారి అన్ని భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయాల్సి ఉంటుంది. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సో త్రివిక్రమ్ ఇప్పటిదాకా చేసినవి తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మెప్పించినవి. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటే కొన్ని కీలక మార్పులు అవసరమవుతాయి. పుష్పలో సుకుమార్ చేసింది అదే. బాహుబలి ద్వారా జక్కన్న మాస్ పల్స్ అందుకుని దీని వల్లే. సో త్రివిక్రమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే యునివర్సల్ అప్పీల్ ఉంటుంది.

గుంటూరు కారంని హ్యాండిల్ చేసిన తీరు త్రివిక్రమ్ మీద విమర్శలు వచ్చేలా చేసింది. కమర్షియల్ గా డబ్బులు వచ్చాయేమో కానీ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తిపరచని మాట వాస్తవం. ఆ మరక పోవాలంటే బన్నీ ప్రాజెక్టు నభూతో నభవిష్యత్ అనే రేంజ్ లో ఉండాలి. నాగవంశీ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇది రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ అయితే కనక వెయ్యి కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎలాగూ అల్లు అర్జున్ పెరిగిన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మరింత కష్టపడతాడు. జనవరిలో అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసి మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టే ప్రణాళిక జరుగుతోంది.

This post was last modified on December 11, 2024 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

2 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

3 hours ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

3 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

4 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

4 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

4 hours ago