పుష్ప 2 సెకండ్ హాఫ్ గంగమ్మ జాతర ఎపిసోడ్ లో ఆడవేషం వేసుకుని అల్లు అర్జున్ పూనకం వచ్చినట్టు డాన్స్ చేస్తూ థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లకు నిజమైన గూస్ బంప్స్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాడు. కానీ బాక్సాఫీస్ వద్ద కూడా అంతకు మించి వీరంగం ఆడుతున్నాడు. కేవలం 4 రోజుల్లో 829 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టి విధ్వంసం స్పెల్లింగ్ రాయిస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతిచోటా తేడా లేకుండా థియేటర్లను జనాలతో నింపేస్తున్న పుష్ప 2 ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సోమవారం సైతం గంటకు 60 వేల బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం.
బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ల వల్ల కాని మైలురాళ్లను ఒక తెలుగు డబ్బింగ్ మూవీ సాధించడం చూసి అక్కడి విశ్లేషకులకు నోట మాట రావడం లేదు. టికెట్ల కోసం బారులు, ఆనందంతో ఉబ్బితబ్బిబవుతూ బయటికొస్తున్న జనం ఇస్తున్న రియాక్షన్లు, క్షణం తీరిక లేకుండా నోరు తెరుచుకుని నెంబర్లు నమోదు చేసుకుంటున్న ట్రాకర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 విశేషాల మీద ఒక పుస్తకమే రాయొచ్చు. తమిళం, కన్నడలో కూడా ఇదే జోరు చూపిస్తున్న ఈ యునానిమస్ బ్లాక్ బస్టర్ బయట ప్రచారం జరుగుతున్నట్టు కేరళలో బలహీనంగా లేదు. అక్కడా జెండా పాతి మోత మ్రోగిస్తోంది.
దీన్ని బట్టి చూస్తే అసలు రెండో వారంలోకి అడుగుపెట్టకుండానే పుష్ప 2 వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడం ఖాయం. ఇంత వేగంగా ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా చేరుకోలేదంటే షాక్ కలగక మానదు. ఫాంటసీ కంటెంట్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఈ స్థాయిలో ఊచకోత చేయడం చూస్తే సరైన హీరో,కథ, దర్శకుడు, సాంకేతిక బృందం చేతులు కలిపితే భాషతో సంబంధం లేకుండా అందరినీ మెప్పించవచ్చని పుష్ప 2 ది రూల్ నిరూపించింది. ఏదో తగ్గేదేలే అంటూ ఊతపదంగా పెట్టుకున్న అల్లు అర్జున్ నిజంగా తగ్గడం ఇష్టమే లేదన్న రీతిలో తుఫానులా విరుచుకుపడటం సరికొత్త హిస్టరీ.
This post was last modified on December 9, 2024 3:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…