Movie News

ప్రభాస్ సినిమాకు రిషబ్ శెట్టి స్టోరీ??

ఇప్పుడున్న ప్యాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ అంత వేగంగా సినిమాలు చేస్తున్న వాళ్ళు టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలోనూ లేరు. ఒకేసారి రెండు మూడు సెట్ల మీద ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా కూల్ గా ఉండటం డార్లింగ్ కే చెల్లింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ ( ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో ది రాజా సాబ్ బ్యాలన్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సెట్లలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవలే సలార్ నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ తో తనతో మూడు ప్రాజెక్టులు ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఏంటంటే ఒక ప్యాన్ ఇండియా మూవీకి కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కథను సమకూరుస్తారట. ప్రస్తుతం ఆయన కాంతార 2ని ఇదే బ్యానర్ లో చేస్తుండగా ఒక పవర్ఫుల్ సబ్జెక్టుని ఇటీవలే హోంబేలే మేకర్స్ కి వినిపించగా అది ప్రభాస్ కు బాగా సూటవుతుందని భావించి ఆ మేరకు లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే దర్శకుడు ఎవరన్నది మాత్రం సస్పెన్స్. సలార్ 2 కాకుండా మిగిలిన రెండింటిలో ఒకటి ప్రశాంత్ వర్మ మరొకటి లోకేష్ కనగరాజ్ చేస్తారని తొలుత వినిపించింది. కానీ అందులో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి హోంబాలే ప్రభాస్ ట్రయోలో పక్కాగా ఫిక్స్ అయినది సలార్ 2 శౌర్యంగ పర్వం మాత్రమే. మిగిలిన రెండింటికి డైరెక్టర్లు, ఇతర క్రూ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక రిషబ్ శెట్టి కాంతార 2 కాకుండా జై హనుమాన్, ఛత్రపతి వీరశివాజీలకు అఫీషియల్ గా ఓకే చెప్పాడు. మరో టాలీవుడ్ మూవీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదు. చూస్తుంటే ప్రభాస్ రాబోయే సంవత్సరాల్లో కూడా తగ్గేదేలే తరహాలో ఇదే దూకుడు కొనసాగించడం ఖాయమనేలా ఉంది. కల్కి 2898 ఏడి సీక్వెల్ కల్కి 2ని ఇంకో ఏడాది లేదా సంవత్సరంన్నర తర్వాత మొదలయ్యే అవకాశముంది. ఎప్పుడు రిలీజని మాత్రం అడగొద్దు.

This post was last modified on December 9, 2024 1:50 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

41 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago