టాలీవుడ్ నుంచి భారతీయ సినీ చరిత్రలో మరో కొత్త అధ్యాయం రాశారు అల్లు అర్జున్, సుకుమార్. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ అందుకోని రికార్డును సాధించి సౌత్ నుంచి నార్త్ దాకా పుష్పరాజ్ ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో వసూళ్ల సాక్షిగా ఋజువు చేశారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించిన ప్రకారం పుష్ప 2 ది రూల్ మొదటి రోజు డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు సాధించి ఏకంగా రాజమౌళి మైలురాళ్లనే దాటేసింది. హిందీలో జవాన్ ని దాటేసి 72 కోట్లతో బాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకున్న పుష్ప 2 నాలుగు రోజుల వీకెండ్ మొత్తాన్ని ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది.
నైజాం, ఓవర్సీస్, సీడెడ్ లో పుష్ప 2 చాలా బలంగా ఉంది. అధిక టికెట్ రేట్ల ప్రభావం ఇవాళ పలు ప్రాంతాల్లో కనిపించినప్పటికీ శని ఆదివారాలు అనూహ్యంగా పుంజుకుంటాయని ట్రేడ్ చెబుతోంది. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద వేరే ఇతర రిలీజులు ఏవీ లేవు. ఒకటే ఆప్షన్. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ లాంటి మరాఠి డామినేట్ మార్కెట్లలోనూ పుష్ప 2 చేస్తున్న భీభత్సం మాములుగా లేదు. ఈ సండే ఒక్క ముంబైలోనే 1400పైగా షోలు వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడులో స్ట్రాంగ్ ఉన్న పుష్ప 2 కేరళలో స్లోగా మొదలై అనూహ్యమైన పికప్ చూపిస్తోంది.
అక్కడక్కడా టాక్ పరంగా కొంత మిశ్రమత కనిపించినప్పటికీ ప్రేక్షకులు పుష్ప 2ని చూసే తీరాలని నిర్ణయించుకోవడంతో క్లాస్, మాస్ తేడా లేకుండా ఐకాన్ స్టార్ అందరినీ థియేటర్లకు రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నా సోమవారం నుంచి హోల్డ్ కీలకం కానుంది. ఇంతే స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ఏ భాషలో ఏ రికార్డు మిగలదు. కాకపోతే వీలైనంత త్వరగా టికెట్ రేట్లు కొంత తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కెజిఎఫ్, జవాన్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని దాటి పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేయడం చూస్తే ఇది వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ మొత్తం కాల్చేసే ఫైర్ అనిపిస్తోంది.
This post was last modified on December 6, 2024 8:18 pm
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…