తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తనదైన ముద్రవేసిన తమన్నా భాటియా.. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ యమా బిజీగా ఉంది. ఇటీవల ఆమె హిందీ మూవీ స్త్రీ 2 లో అతిధి పాత్రతో పాటు ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన సింకదర్ కా ముకద్దర్ సిరీస్ ఓటీటీలో బాగా రన్ అవుతోంది. వచ్చే ఏడాది ఆమె ఒడెలా 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.