నిన్న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ల సందర్భంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. పోలీసులు సకాలంలో స్పందించి ప్రాధమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె పిల్లలు శ్రీతేజ, శాన్వి ఐసియులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తండ్రి భాస్కర్ మాట్లాడుతూ కొడుకు అల్లు అర్జున్ వీరాభిమాని కావడం వల్లే బెనిఫిట్ షోకు వచ్చామని, బన్నీ రాకతో రద్దీ పెరిగి తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నాడు.
జరిగిన దుర్ఘటనకు అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. దురదృష్టకరంగా జరిగిన ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేందుకు తమ బృందం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, పిల్లాడికి హాస్పిటల్ లో జరుగుతున్న ట్రీట్ మెంట్ ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ట్వీట్ ద్వారా పేర్కొంది. తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బన్నీ ఇప్పటిదాకా స్పందించలేదు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతోంది.
ఏది ఏమైనా ఇకపై స్పెషల్ షోలకు వెళ్లేముందు కుటుంబాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళెప్పుడు పొంచి ఉన్న రిస్క్ గుర్తించాలి. రీ రిలీజులకే క్రాస్ రోడ్స్ ప్రాంతం బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటిది పుష్ప 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ వచ్చినప్పుడు అందులోనూ హీరో స్వయంగా థియేటర్ విజిట్ చేసినప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు. పెద్దలు ఆ ఒత్తిడిని తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలు,మహిళలకు ఊపిరి ఆడని పరిస్థితి ఒక్కోసారి నెలకొంటుంది. పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాలేక పోయినా మిగిలినవాళ్ళకు ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది.
This post was last modified on December 5, 2024 3:23 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…