పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

కొచ్చి లో జరిగిన పుష్ప ఈవెంట్ కి తన బ్లౌజ్ పై పుష్ప అని ఎంబ్రాయిడరీ చేయించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది రష్మిక. ఇక తాజాగా జరిగిన ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందమైన నీలిరంగు చీరను ధరించింది. ఇక ఈ చీరపై పుష్ప, శ్రీవల్లి అంటూ వర్క్ చేయించింది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోలతోపాటు మూవీ విడుదలవుతున్న ఎక్సైట్మెంట్ ని కూడా చిన్న పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంది.