బాహుబలి అప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్‌కు పరిచయం లేని ఫీట్లు ఎన్నో సాధించింది. ఒక్క రోజులో వంద కోట్లు.. ఓవరాల్‌గా వెయ్యి కోట్లు.. ఇలా అప్పటిదాకా ఊహకు కూడా అందని వసూళ్ల ఘనతలను సాధించింది. అలా అని తర్వాత వచ్చిన భారీ చిత్రాలన్నీ ఈ ఫీట్‌లను సాధించేయలేదు. ఇప్పటికీ తొలి రోజు వంద కోట్లు.. ఓవరాల్‌గా వెయ్యి కోట్లు అన్నది చాలా పెద్ద ఘనతగానే ఉంది. ఇలాంటి సమయంలో ఓ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకోవడం అంటే గొప్ప విషయమే.
అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ సీక్వెల్ ‘పుష్ప-2’ ఈ ఘనత సాధించింది. వరల్డ్ వైడ్ అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్‌తో సాగిపోతున్న ‘పుష్ప-2’ కేవలం ప్రి సేల్స్‌తోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. దీని గురించి ట్రేడ్ పండిట్లు గొప్పగా చెబుతున్నారు.ఒక్క యుఎస్‌లోనే ‘పుష్ప-2’ ప్రి సేల్స్‌తో 4 మిలియన్ డాలర్ల మార్కును ముందే టచ్ చేసేయడం విశేషం. యుఎస్‌లోనే అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో.. నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా వెయ్యి రూపాయల రేటుతో రిలీజ్‌కు ఒక్క రోజు ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు. ఆ షోలన్నీ ఫుల్స్ పడుతున్నాయి. ఇక తొలి రోజుకు వైడ్ రిలీజ్ ప్లాన్ చేయగా.. షోలు చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీగా వసూళ్లు రాబట్టింది ‘పుష్ప-2’. రిలీజ్‌కు ఒక్క రోజు ముందే వంద కోట్ల వసూళ్లంటే సామాన్యమైన విషయం కాదు.
తొలి రోజు మొత్తం రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ఈజీగా రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం. ట్రేడ్ పండిట్లయితే డే-1 రూ.250 కోట్ల మార్కును కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వెయ్యి కోట్ల వసూళ్లు కేక్ వాకే.