మొన్న ఈటీవీ విన్ ఓటిటిలో రిలీజైన ‘క’ దాదాపుగా ఒక రోజు మొత్తం పైరసీ కాకుండా కట్టడి చేయడంలో సదరు టీమ్ చేసిన కృషికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలే ఈ సమస్యని పరిష్కరించలేక చేతులు ఎత్తేస్తే ప్యూర్ తెలుగు కంటెంట్ తో రనయ్యే లోకల్ యాప్ దాన్ని చేసి చూపించడం మాములు విషయం కాదు. అతి వేగంగా వంద మిలియన్ మినిట్స్ అందుకున్న సందర్భంగా ఆ విజయాన్ని పంచుకోవడానికి కిరణ్ అబ్బవరంతో పాటు ‘క’ టీమ్ ఇవాళ మీడియాతో ముచ్చట్టించింది. అందులో భాగంగా కొన్ని విశేషాలు, ఛాలెంజులు చోటు చేసుకున్నాయి.
ముప్పై సంవత్సరాల లోపు వయసున్న పాతిక మంది ఈటీవీ బృందంలో ఉన్నారని, ప్యాషన్ తో పని చేయడం వల్లే ‘క’ పైరసీని నిలవరించగలిగామని అన్నారు. కొందరు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ని వాడి చేసినా తమ ఒరిజినల్ ఫైల్ ని క్రాక్ చేయలేకపోయారని, భవిష్యత్తులో ఏ రూపంలో అయినా పైరసీ చేయలేని విధంగా పలు మార్పులు చేయబోతున్నట్టు సంస్థ తరఫున ప్రతినిధి చెప్పుకొచ్చారు. మరో రెండు మూడు నెలల్లో సాధ్యమయ్యేలా ప్రణాళిక ఉందట. ఇదే నిజమైతే ఇండస్ట్రీకి, ఓటిటి సంస్థలు చాలా మేలు చేసినట్టు అవుతుంది. రీచ్, ఆదాయం రెండూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.
ఇతర ఓటిటి సంస్థలు దీన్ని అందిపుచ్చుకుంటాయి. వీడియో క్యాసెట్ల కాలం నుంచే ఇండస్ట్రీకి భూతంలా అవతరించిన పైరసీ రూపం మార్చుకుందే తప్ప చనిపోలేదు. బాహుబలి లాంటి ప్యాన్ ఇండియా సినిమాని సైతం వాళ్ళు వదల్లేదు. అప్పట్లో ఇది చేస్తున్న వాళ్లను ఇతర రాష్ట్రానికి వెళ్లి పట్టుకున్నారు కానీ తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది. సిడి ల నుంచి టొరెంట్ల దాకా, పెన్ డ్రైవ్ ల నుంచి టెలిగ్రామ్ దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఈటీవీ ఇలాంటి కఠిన చర్యలకు పూనుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా కొత్త సినిమా చూడాలంటే సదరు యాప్ లోకే వెళ్లడం ప్రేక్షకులకు అలవాటవుతుంది.
This post was last modified on November 30, 2024 6:58 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…