అదేంటి గత ఏడాది వచ్చిన సినిమా ఇప్పుడు మళ్ళీ ట్రెండవ్వడం ఏమిటనుకుంటున్నారా. దానికి కారణం విజయ్ 69. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు తన చివరి సినిమాగా తలపతి విజయ్ చేస్తున్న సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం గత కొన్ని వారాలుగా జరుగుతూనే ఉంది. దాదాపు ఇది ఖరారేనని మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా కొద్దిరోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రొడక్షన్ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇది నిజమా కాదానే అనుమానం ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజా చెన్నై టాక్ ప్రకారం భగవంత్ కేసరి రీమేక్ హక్కులను కెవిఎన్ సంస్థ అధికారికంగా కొనుక్కుందట.
యధాతథంగా తీయకుండా విజయ్ ఇమేజ్ కు అనుగుణంగా దర్శకుడు హెచ్ వినోత్ కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. శ్రీలీల స్థానంలో మమిత బైజు, కాజల్ అగర్వాల్ ప్లేసులో పూజా హెగ్డే, అర్జున్ రాంపాల్ కు బదులు బాబీ డియోల్ ఇలా క్యాస్టింగ్ లోనే స్పష్టంగా మ్యాటరేంటో అర్థమవుతోందిగా. శరత్ కుమార్ చేసిన క్యామియో కోసం శివరాజ్ కుమార్ ని అడిగి తర్వాత వద్దనుకున్న వినోత్ ఇప్పుడాయన స్థానంలో వేరే ఆర్టిస్టుని తీసుకోబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం కాబట్టి అదెంత ఆకర్షణగా ఉంటుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. స్ట్రెయిట్ సబ్జెక్టనుకున్న విజయ్ ఫ్యాన్స్ కి ఇది కొంచెం షాక్ లాంటిదే.
విషయం తెలియడం ఆలస్యం భగవంత్ కేసరిలో ఏముందాని విజయ్ అభిమానులు చూడటం మొదలుపెట్టారు. ప్రైమ్ లో తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఈ ఒక్క ఆడియోని తీసేయమని ఫ్యాన్స్ కోరుతున్నారట. అమ్మాయిలను స్వయంశక్తితో ఎలా ప్రోత్సహించాలనే పాయింట్ మీద అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి విజయ్ కు మంచి ఛాయస్ అవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ రెండూ సమపాళ్లలో బ్యాలన్స్ అవుతాయి కాబట్టి పొలిటికల్ ఎంట్రీకి ముందు ఇదే సరైన ఛాయస్. ఇప్పటికే పాతిక శాతానికి పైగానే పూర్తయ్యింది.
This post was last modified on November 29, 2024 9:24 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…