సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సునామి మొదలైపోతుంది. దీపావళి తర్వాత సరైన ఫీడింగ్ లేక అల్లాడిపోతున్న థియేటర్లు హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోయే టైం వస్తోంది. ఖాళీగా పార్కింగ్ స్టాండుల్లో, క్యాంటీన్లలో హస్క్ వేసుకుంటున్న సిబ్బంది క్షణం తీరిక లేని పనులతో బిజీ కాబోతున్నారు. ముందస్తు సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ రేపు మొదలుపెట్టబోతున్నారు. అయితే టికెట్ రేట్లకు సంబంధించిన అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఏ క్షణమైనా వచ్చే అవకాశముంది. రావడం ఆలస్యం బుక్ మై షో, పేటిఎం తదితర యాప్స్ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతాయి.
ఇప్పుడు అందరి చూపు టికెట్ రేట్ల పెంపు ఏ మోతాదులో ఉండబోతోందనే దాని మీదుంది. ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు పరిశ్రమ విన్నపాల పట్ల సానుకూలంగా ఉన్నాయి కాబట్టి హైక్ గురించి మైత్రి మేకర్స్ టెన్షన్ పడటం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం తమ బ్యానర్ హీరో కావడంతో పాటు పరిశ్రమ తరఫున ఎవరు ఏది అడిగినా నో అనని మనిషి. కాబట్టి గరిష్టంగా దేవర కంటే ఎక్కువగా ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 మధ్యలో పెంపు తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు. అంటే మల్టీప్లెక్స్ రేట్ 400 రూపాయలు తాకొచ్చు. తెలంగాణలో దేవరకిచ్చినంతే పెంచుతారనే టాక్ ఉంది కానీ ఎంత మొత్తమనేది చూడాలి.
రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకటే రేట్ ఉండే అవకాశముందని ట్రేడ్ అంచనా. రెగ్యులర్ షోల సంగతి ఎలా ఉన్నా ప్రీమియర్ల డిమాండ్ మాత్రం మాములుగా లేదు. అర్ధరాత్రి ఒంటి గంట, తెల్లవారుఝామున షోలకు విపరీతమైన ఒత్తిడి నెలకొంటోంది. బిసి సెంటర్ల సింగల్ స్క్రీన్ల అధికారిక ధరే 750 దాకా పలుకుతోందట. ముందు రోజుకు ఇది ఎన్ని వేల రూపాయలకు చేరుతుందో ఊహించడం కష్టం. రెండు వారాలుగా థియేటర్లకు వెళ్లకుండా ఆదాచేసిన డబ్బంతా సినీ ప్రియులు పుష్ప 2 కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టికెట్ దొరకాలే కానీ డోంట్ కేర్ అన్న తరహాలో బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
This post was last modified on November 29, 2024 9:12 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…