దేశమంతా ప్రధాన భాషల్లో విడుదల చేసినంత మాత్రాన ఏ సినిమా అయినా ప్యాన్ ఇండియా అయిపోదు. దాన్ని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గర చేయాలి. దాని గురించి మాట్లాడుకునేలా చేయాలి. అప్పుడే జనాల దృష్టి ఇటువైపు మళ్ళి మొదటి రోజు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. పుష్ప 2 ఈ విషయంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై వెళ్లి అక్కడి మీడియాతో ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేసి, ఫ్లైట్ ఎక్కి దిగేస్తే పనైపోదని నిరూపిస్తోంది. ఎంత ఖర్చు పెట్టినా సరే దానికి తగ్గ ఫలితం ఎలా అందుకోవాలో సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది.
బీహార్ లాంటి చోట ట్రైలర్ లాంచ్ చేయాలనే ఆలోచన దగ్గర పుష్ప 2 వేసిన మొదటి అడుగు బ్రహ్మాండంగా పేలింది. సౌత్ సినిమాలను అంతగా పట్టించుకోని చోట రెండులక్షల పైగా జనాలను స్వచ్చందంగా పోగయ్యేలా చేయడం మాములు విషయం కాదు. ఇక చెన్నైలో జరిగిన ఈవెంట్ కు బ్లాక్ బస్టర్ అనే మాట చిన్నది. కోలీవుడ్ మీడియా సైతం ఇంత స్పందన రావడం ఊహించలేదు. ఇక కోచిలో జరిగింది చూశాం. మళయాళీల మీద తనకున్న ప్రేమను అల్లు అర్జున్ వ్యక్తపరిచిన తీరు ఆల్రెడీ ఉన్న ఫాలోయింగ్ ని మరింత పెంచింది. కేరళ ఓపెనింగ్స్ గురించి ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు బన్నీ వెళ్లలేకపోయినా రష్మిక మందన్నను తీసుకెళ్లడం ద్వారా మైత్రి అనుసరించిన మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది. బెంగళూరు, హైదరాబాద్ ఈవెంట్లు చేస్తారా లేక అనుమతులు లేక వద్దనుకుంటారా ఇంకొద్ది గంటల్లో తేలుతుంది కానీ పుష్ప 2కి ఇప్పటికిప్పుడు అదనంగా రావాల్సిన బజ్ అయితే ఏమి లేదు. కెజిఎఫ్ 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ టైంలో కనిపించిన ఫీవర్ మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ చూస్తోంది. డిసెంబర్ 5న థియేటర్ల దగ్గర జరగబోయే జాతర మాటలకందేలా లేదు. రష్మిక అన్నట్టు పుష్ప ఇప్పుడు కేవలం పేరు కాదు ఒక బ్రాండ్.
This post was last modified on November 29, 2024 12:00 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…