పుష్ప 1 ది రైజ్ లో చివరి గంట మాత్రమే కనిపించినా ఫహద్ ఫాసిల్ చూపించిన ప్రభావం చాలా బలమైంది. దేహం సన్నగా ఉన్నా కరుడుగట్టిన ఆలోచనలను నవ్వుతూ దాచేసి స్వార్థం కోసం ఎంతకైనా తెగించే SP భన్వర్ సింగ్ షెకావత్ గా ఫఫా చూపించిన పెర్ఫార్మన్స్ అందరు చేసేది కాదు. అందుకే పుష్ప 2 ది రూల్ లో నిడివి ఎక్కువగా ఉండే తన పాత్ర మీద భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ లో చూపించిన శాంపిల్స్ వాటిని అందుకునే హామీ ఇచ్చాయి. తాజాగా కోచిలో జరిగిన పుష్ప 2 వేడుకలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా తన మిత్రుడు కం విలన్ ఫహద్ ఫాసిల్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు.
షికావత్ సార్ కి పుష్పరాజు ఎలివేషన్!
Gulte Telugu Telugu Political and Movie News Updates