పుష్ప 2 ది రూల్ కు బ్యాక్ గ్రౌండ్ అందించే బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తో పాటు మరో ఇద్దరికీ బదలాయింపు చేయడం కొద్దిరోజుల క్రితం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఏమిటనే కారణాలు రకరకాలుగా వినిపించాయి కానీ తెరవెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో దేవినో సుకుమారో ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బీజీఎమ్ ఇవ్వడంలో వన్ అఫ్ ది బెస్ట్ గా రెండు దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్న డిఎస్పికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం విచిత్రమే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మరో సినిమా ఈ లిస్టులో చేరుతోందట.
అజిత్ హీరోగా మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకు తొలుత తీసుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాదే. అయితే దీని నేపధ్య సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ తో చేయించే ఆలోచనలు జరుగుతున్నట్టు వచ్చిన వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనికీ అధికారిక ధృవీకరణ లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే పుష్ప 2, గుడ్ బ్యాడ్ ఆగ్లీ రెండూ మైత్రి మూవీ మేకర్స్ వే. ఈ మతలబు ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ మార్పుకు దారి తీసిందేమో ప్రస్తుతానికి సస్పెన్స్.
2025 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తొలుత పండక్కు రాదనే ప్రచారం జరిగింది కానీ మైత్రి మాత్రం పొంగల్ ని వదలుకుంటే భారీ వసూళ్లు మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద పనులు చేయిస్తున్నట్టు టాక్. అందుకే ఆ ఒత్తిడి వద్దనుకునే దేవి నో చెప్పాడో లేక అజిత్ టీమ్ వద్దనుకున్నారో తెలియదు. తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్ గురించి ఇప్పటికే సమాచారం వెళ్లిపోయింది. కొన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ ని పంపిణి చేస్తున్న మైత్రి దాంతో పాటుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అగ్రిమెంట్లు చేసుకుంటోందని వినికిడి. స్పష్టత కోసం ఇంకొద్దిరోజుల్లో వేచి చూడక తప్పదు.
This post was last modified on November 25, 2024 6:08 am
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…