పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఏం మాట్లాడతాడనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే దేవి చాలా స్మూత్ గా సెటైర్లు వేసి ఫ్యాన్స్ కి విషయం చెప్పీ చెప్పనట్టు ఊరించాడు. ఏదైనా మనం అడిగి తీసుకోవాలని, అడగకుండా ఎవరూ ఇవ్వరని, నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా తెరమీద దక్కాల్సిన క్రెడిట్ అయినా అడగాల్సిందేననన్నాడు. దీని వెనుక ఎన్నో అర్థాలు వస్తాయి. ఫలానా టైంకి బీజీఎమ్ కావాలని తనను అడగకపోవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందనే భావన వినిపించింది.
దేవిని నిర్మాతలు అడగలేదా లేక, ఎందుకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొకరికి ఇస్తున్నారని తనే ప్రొడ్యూసర్లను అడగలేదా, లేక ఇంత ఒత్తిడితో చేస్తే క్వాలిటీ తగ్గుతుందని భావించి తనే తప్పుకున్నాడా కారణాలు తెలియదు కానీ మొత్తానికి దేవి చురకలు బాగున్నాయి. ఇక ఇతర విషయాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరోయిన్లు మొదటిసారి ఐటెం సాంగ్ చేసేటప్పుడు తన కంపోజింగ్ లోనే వచ్చాయని కొన్ని ఉదాహరణలు వివరించాడు. రంగస్థలం (పూజా హెగ్డే), అందమైన తారల స్పెషల్ సాంగ్ (కింగ్), పుష్ప 1 (సమంత), నే పక్కా లోకల్ (జనతా గ్యారేజ్) ఇవన్నీ తన పాటలేనని చెప్పుకొచ్చాడు.
ఇక్కడితో అయిపోలేదు. నిర్మాత రవిని ఉద్దేశించి నా మీద ప్రేమతో పాటు కంప్లయింట్స్ కూడా మీకు ఎక్కువని, టైంకి చెప్పినవి ఇవ్వలేదని ఫీలవుతారని చెబుతూ స్టేజి మీద ఆలస్యానికి కారణం కూడా తనదైన శైలిలో వివరించాడు. మొత్తానికి స్పీచ్ లో మాత్రం కూల్ ఫైర్ కనిపిచింది. ఇక తాజాగా వదిలిన కిస్ కిస్ కిసిక్కు దెబ్బలు పడతాయి కూడా హిట్టు ఖాతాలో వెళ్లేలా ఉంది.. శ్రీలీల గ్లామర్ తో పాటు బన్నీతో కలిసి ఆమె చేసిన హుషారు డాన్సులు ఓ రేంజ్ లో పేలేలా ఉన్నాయి. ఈ పాట మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అభిమానుల చూపు దీని మీదే ఉంది. ఏ రేంజ్ అన్నది ఇంకో రెండు మూడు రోజులు ఆగాలి.
This post was last modified on November 24, 2024 10:58 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…