దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన జీతూ జోసెఫ్ ప్రభావం మలయాళ పరిశ్రమ మీద చాలా బలంగా ఉంది. ఒక ట్రెండ్ గా మారిపోయిన ఈ విభాగంలో తర్వాత చాలా సినిమాలొచ్చాయి. అధిక శాతం విజయం సాధించాయి. ఆ మధ్య కిష్కింద కాండం థియేటర్లో వచ్చినప్పుడు తెలుగు రిలీజ్ కాకపోయినా సరే హైదరాబాద్ జనాలు సబ్ టైటిల్స్ తో చూసి మరీ ఎంజాయ్ చేశారు. ఇటీవలే హాట్ స్టార్ లో అన్ని బాషల డబ్బింగ్ తో పొందుపరిచాక సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఇదే కోవలో రిలీజైన సూక్ష్మదర్శిని సైతం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూ వసూళ్లు కొల్లగొడుతోంది.
అంటే సుందరానికిలో నాని సరసన నటించి టాలీవుడ్ కు పరిచయమైన నజ్రియా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ కాదు. వినడానికి సింపుల్ గా అనిపిస్తుంది. పక్కింట్లో ఉన్న బామ్మ హఠాత్తుగా మాయం కావడంతో ఆమె కొడుకు మాన్యుయెల్ మీద నజ్రియా అనుమానం పడుతుంది. స్వతహాగా డిటెక్టివ్ స్వభావమున్న ఈ గృహిణి పెద్దావిడ ఎక్కడికి వెళ్లిందన్న దాని మీద పరిశోధన మొదలుపెడుతుంది. తర్వాత జరిగేది తెరమీద చూస్తేనే మజా. ఊహించని మలుపులు, ఆడియన్స్ ని చిక్కుముడిలో పెడుతూ క్లైమాక్స్ లో అదిరిపోయే షాక్ ఇస్తాయి.
ఇది రీమేక్ జరిగితే మన దగ్గర వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం కానీ అలాంటి రిస్క్ చేయకుండా యధావిధిగా ఒరిజినల్ వెర్షన్ చూస్తేనే కిక్ దక్కుతుంది. హింస, రక్తపాతం, జుగుప్స కలిగించే సన్నివేశాలు ఇవేవి లేకుండా ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాయొచ్చని దర్శకుడు ఎంసి జితిన్ నిరూపించాడు. మంజుమ్మల్ బాయ్స్, తలవన్, ఇరట్ట లాంటి థ్రిల్లర్స్ సరసన ప్రత్యేక చోటు దక్కించుకుంటున్న సూక్ష్మ దర్శిని ప్రస్తుతం హైదరాబాద్ లో హౌస్ ఫుల్ షోలతో ప్రదర్శించబడుతోంది. డైరెక్ట్ ఓటిటిలో కాకుండా తెలుగు అనువాదాలు థియేటర్లకు తీసుకొస్తే వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on November 24, 2024 6:30 pm
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…