నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం కావడంతో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం జనాల్లో కనిపించింది. దానికి తోడు మహేష్ బాబు ప్రత్యేకంగా మేనల్లుడి కోసం సమయం కేటాయించి ట్విట్టర్ ప్రమోషన్స్ లో భాగం పంచుకోవడంతో అంతో ఇంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కనిపించారు. అసలు పాయింట్ ఇది కాదు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ రాసిన కథ కావడాన్ని మార్కెటింగ్ లో ఎక్కువ వాడుకున్నారు. ఆయనే ఇంటర్వ్యూలలో పాల్గొని మరీ హైప్ పెంచే ప్రయత్నం చేశారు.
ఇంతా చేసి దేవకీనందన వాసుదేవ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. కృష్ణుడు, కంసుడు, సత్యభామ కాన్సెప్ట్ ని ఇప్పటి ట్రెండ్ కు కనెక్ట్ అయ్యేలా సోషలైజ్ చేయడానికి చూసిన దర్శకుడు అర్జున్ జంధ్యాల కథనాన్ని తీర్చిదిద్దిన విధానం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడం ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. పైగా అశోక్ బాడీ లాంగ్వేజ్ మించి ఎలివేషన్లు, ఫైట్లు పెట్టడం ఏ మాత్రం సింక్ కాలేదు. ఆర్టిస్టుల ఎంపిక, రొటీన్ సంభాషణలు, ఎప్పుడో పాతబడిన ట్రీట్ మెంట్, పండని కామెడీ ఇలా ఎన్నో మైనస్సులు దేవకీనందన వాసుదేవను నీరసంగా మార్చేశాయి. దీనికి బాద్యుడు ప్రశాంత్ వర్మ కాకపోవచ్చు.
కానీ తన దగ్గర ముప్పై మూడు కథలున్నాయని ఇటీవలే ఆయన చెప్పింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. అంటే ప్రస్తుత ఆడియన్స్ కి సింక్ కాలేనివి వాటిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కొన్ని మార్పులు చేశారని ప్రశాంత్ వర్మ ముందే చెప్పినప్పటికీ అసలు స్టోరీ తనదే కాబట్టి చూసేవాళ్ల కోణంలో హనుమాన్ సృష్టికర్త క్రియేటివిటీగానే చూస్తారు. పుష్ప 2 రిలీజ్ దగ్గరలో ఉన్న తరుణంలో జనాల మూడ్ దాని మీదే ఉంది. అందుకే నిన్న మెకానిక్ రాకీ, జీబ్రాలకు సైతం యావరేజ్ ఆక్యుపెన్సీనే నమోదయ్యాయి. వాటికే ఇలా ఉంటే ఇక దేవకీనందన వాసుదేవ పరిస్థితి ఏంటో వేరే చెప్పాలా.
This post was last modified on November 23, 2024 11:07 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…