నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ముందు సంక్రాంతికే అనుకున్నా పోటీ ఒత్తిడిలో నలిగిపోకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఖచ్చితంగా వంద కోట్ల గ్రాస్ తెస్తుందనే నమ్మకాన్ని నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ వ్యక్తం చేయడం హైప్ ని పెంచేసింది. ఇక బుజ్జి తల్లి పాట విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ లోని వింటేజ్ స్టైల్ ని బయటికి తెచ్చిందని మూవీ లవర్స్ సంతోషపడుతున్నారు.
చాలా కూల్ మెలోడీగా, ఇష్టసఖిని ప్రియుడు ఎంతగా ఆరాధిస్తున్నాడో గీత రచయిత శ్రీమణి వర్ణించిన తీరు హృద్యంగా ఉంది. నీరు లేని చాపల్లే, తారలేని నింగల్లే అంటూ బుజ్జితల్లి గురించి సముద్రం భాషలోనే వ్యక్తపరచడం అచ్చ తెలుగులో స్వచ్ఛంగా సాగింది. జావేద్ ఆలీ గాత్రం ప్రాణం పోయగా వీడియోలో పొందుపరిచిన చైతు, సాయిపల్లవి విజువల్స్ అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఒకప్పుడు వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో వినిపించే స్మూత్ నెస్ దేవి మళ్ళీ ఇందులో వినిపించాడు. రంగస్థలం, ఉప్పెన తర్వాత డిఎస్పి నుంచి మళ్ళీ ఆ రేంజ్ ఆల్బమ్ తండేల్ అవ్వడం చాలా అవసరం.
పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు వేరొకరికి ఇవ్వడం, కంగువ మ్యూజిక్ గురించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం దేవి అభిమానులను కలవరానికి గురి చేసింది. తిరిగి తానేంటో ప్రూవ్ చేయడానికి ఉన్న ఆయుధం తండేల్. ఎమోషనల్ లవ్ స్టోరీ అయినప్పటికీ దేవి మార్కు ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు కనక సరిగ్గా పడితే సినిమా విజయానికి దోహదం చేస్తాయి. బుజ్జితల్లి విన్నాక ఫ్యాన్స్ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మీద వంద కోట్ల దాకా బడ్జెట్ పెట్టారనే టాక్ ఉంది. చైతు దీని కోసమే మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గ ఫలితం దక్కాలి.
This post was last modified on November 22, 2024 11:15 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……