ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ప్రమోషన్లు చాలా కీలకంగా మారాయి. ఎంత మంచి సినిమా తీసినా.. దాని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ప్రోమోలు రూపొందించడం.. ప్రమోషన్ల పరంగా హడావుడి చేయడం చాలా అవసరంగా మారింది.
ఐతే ప్రోమోలు, ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచి థియేటర్లకు రప్పించడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. కొందరు మాత్రం ఈ విషయంలో మాస్టర్ అనిపిస్తారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఈ కోవకే చెందుతాడు. గత వారం వరుణ్ తేజ్ సినిమా ‘మట్కా’ రిలీజైంది. దానికి మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయారు. వరుణ్.. విశ్వక్ కంటే పెద్ద స్టార్.
కానీ తన గత సినిమాల ఫెయిల్యూర్లు ‘మట్కా’ మీద ఎఫెక్ట్ చూపించాయి. టీం కూడా ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సినిమాలో కంటెంట్ కూడా వీక్ కావడంతో డిజాస్టర్ అయింది. ఐతే ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
కానీ విశ్వక్ కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’కి మంచి ఓపెనింగ్స్ రాబోతున్నాయని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ముందు రోజే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తుండగా.. ఆ షోలన్నీ దాదాపుగా సోల్డ్ ఔట్ అయిపోయాయి. విశ్వక్ సినిమా అంటే యూత్ చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా అని అతడి సినిమాలన్నీ తెగ ఆడేస్తున్నాయనుకుంటే పొరపాటే.
చివరి చిత్రాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ధమ్కీ ఫెయిల్యూర్లే. అయినా సరే ‘మెకానిక్ రాకీ’కి బజ్ క్రియేట్ చేయగలిగాడు విశ్వక్. నిజానికి నెల ముందు ఈ సినిమాను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర్నుంచి ప్రమోషన్ల హంగామా పెరిగింది. రిలీజ్ టైంకి బజ్ క్రియేట్ అయింది. ఎలాంటి సినిమా తీసినా.. ప్రమోషన్లలో విశ్వక్ చెప్పే మాటలు, తన చర్యలు బజ్ క్రియేట్ చేసి ఓపెనింగ్స్‌కు ప్లస్ అవుతుండడం విశేషం.
This post was last modified on November 21, 2024 9:58 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…