ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. త్వరగా గాయం మాసిపోవాలంటే ఇంత కంటే మంచి మందు లేదని కోరుతున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వేల కోట్లు వసూలు చేస్తుందని బీరాలు పోయిన దర్శక నిర్మాతలకు కంగువ ఇచ్చిన ట్విస్ట్ అంతా ఇంతా కాదు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే థియేటర్ల బయట యూట్యూబ్ రివ్యూలు ఇచ్చే బ్యాచ్ వల్ల నష్టం జరిగిందని గుర్తించి వాళ్ళపై నిషేధం విధించే దాకా వెళ్ళింది. సరే జరిగిందేదో జరిగింది.
ప్రముఖ నటుడు కం దర్శకుడు ఆర్జె బాలాజీకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో దేవుడి తరహా పాత్రను సూర్య పోషించబోతున్నాడు. అధికారిక ప్రకటన కొద్దిరోజుల క్రితమే ఇచ్చారు. ఇందులో హీరోయిన్ గా త్రిష ఎంపికయ్యిందనే టాక్ చెన్నై వర్గాల్లో బలంగా తిరుగుతోంది. సూర్య – త్రిష అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఆరు. 2005లో రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ముఖ్యంగా చూడొద్దే నను చూడొద్దే అప్పట్లో మ్యూజిక్ లవర్స్ ని ఊపేసింది. అంతకు ముందు ఈ కాంబో యువ, మౌనం పెసియాదే (తెలుగు రీమేక్ అదంతే అదోటైపు) సందడి చేసింది.
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే విశేషమే. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఊపుమీదున్న త్రిషకు స్టార్ హీరోల సరసన ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ చూశాక డైరెక్టర్లు ఎక్కువ ఆలోచించడం లేదు. ప్రస్తుతం చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, మోహన్ లాల్ లాంటి సీనియర్ల సరసన ఆడిపాడుతున్న త్రిష ఇంత గ్యాప్ తర్వాత సూర్యతో జోడి అంటే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయమే. టైటిల్ ఇంకా నిర్ధారణ కాని ఈ ప్యాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ కావాల్సిన టైంలో కార్తీక్ సుబ్బరాజ్, ఆర్జె బాలాజీల మీద పెద్ద బాధ్యతే ఉంది.
This post was last modified on November 21, 2024 6:04 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…