శివమణి సినిమా గుర్తుందా. అందులో నాగార్జున ఫోన్ నెంబర్ గా కొన్ని అంకెలను క్యాప్షన్ గా పెడితే దాన్ని సొంతం చేసుకునేందుకు లక్షల మంది ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అది దొరకదని తెలిసినా ఏదో ప్రయత్నించారు. అందులో ఎంఎస్ నారాయణకు షేక్ ఇమాం పేరుతో వచ్చే రాంగ్ కాల్స్ తో నరకం అనుభవించే కామెడీ ఎపిసోడ్ భలేగా పేలింది.
ఇప్పుడలాంటి అనుభవమే ఒక విదార్థికి ఎదురయ్యింది. బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ అమరన్ లో సాయిపల్లవి తన ఫోన్ నెంబర్ శివ కార్తికేయన్ కు ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. చూసేవాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది.
కట్ చేస్తే అది తమిళనాడుకి చెందిన వివి వగీశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్ధిది. అమరన్ రిలీజయ్యాక అది నిజమనుకుని సాయిపల్లవి అభిమానులు ఏకధాటిగా దానికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వగీషన్ జీవితం మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎవరెవరో చేస్తున్న ఫోన్లకు తల్లడిల్లిపోయాడు. కనీసం క్యాబ్ బుక్ చేసుకుందామన్న వీలు లేనంతగా ఎంగేజ్ ఉండాల్సి రావడంతో ఇతని సహనం పతాక స్థాయికి చేరుకుంది. దాంతో కోటి పది లక్షల పరిహారం డిమాండ్ చేస్తూ ఏకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించి నిర్మాతకు కోర్టు నోటీసులు పంపాడు.
ఇంకా హియరింగ్ కు రాలేదు కానీ కుర్రాడికి ఎలాంటి న్యాయం దక్కుతుందో చూడాలి. అయినా డైలాగులు రాసేటప్పుడు ఆ నెంబర్ చెలామణిలో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రచయిత, దర్శకుడిదే. ఏదో తోచింది పెట్టేస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తో పనుండదు. ఎగ్జైట్ మెంట్ తప్ప ఇంకేదీ పట్టించుకోరు.
సాయిపల్లవి నెంబరని భావించడానికి వాళ్ళ అమాయకత్వం ప్రేరేపించి ఉంటుంది. కానీ వగీషన్ ప్రత్యక్షంగా చూస్తున్న నరకానికి ఎవరు బాధ్యులు. అమరన్ నిర్మాత రాజ్ కమల్ అధినేత కమల్ హాసన్ దీన్ని ఎలా ఎదురుకుంటారో.
This post was last modified on November 21, 2024 7:35 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…