కొన్ని రోజుల కిందట నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్‌ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్‌ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ అతను మౌనంగా ఉండిపోయాడు.
కాగా ఇప్పుడు నయన్ మళ్లీ లైన్లోకి వచ్చింది. తన డాక్యుమెంటరీకి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో కంటెంట్ వాడుకోవడానికి సహకరించి, ఎన్వోసీ ఇచ్చిన వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఈ నోట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ (సైరా).. శివప్రసాద్ రెడ్డి (బాస్), యలమంచిలి సాయిబాబు (శ్రీరామరాజ్యం)లకు నయనతార థ్యాంక్స్ చెప్పింది.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ (జవాన్)లకు.. ఇంకా తమిళం, మలయాళంలో తాను నటించిన సినిమాల నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతించిన ఎంతోమంది నిర్మాతలకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. ఐతే ఇక్కడ ధనుష్ పేరు ఎత్తకపోయినా ఈ నోట్ ద్వారా పరోక్షంగా ధనుష్ మీద కౌంటర్ వేసినట్లే భావిస్తున్నారు నెటిజన్లు. ఫుటేజ్ వాడుకోవడానికి పెద్ద మనసుతో అంగీకరించారంటూ వీళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిందంటే.. ‘నానుం రౌడీ దా’ కంటెంట్ ఇవ్వని ధనుస్‌ను కౌంటర్ చేసినట్లే కదా.
This post was last modified on November 21, 2024 4:17 pm
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…