చాలా గ్యాప్ తర్వాత కామెడీ జానర్ కు వచ్చేద్దామని అల్లరి నరేష్ ట్రై చేసిన ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ కావడంతో తిరిగి సీరియస్ కథల వైపు షిఫ్ట్ అయిపోయాడు. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన సుబ్బు దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఇప్పటికే పలు డేట్లు మార్చుకున్న ఈ రస్టిక్ డ్రామా ఎట్టకేలకు డిసెంబర్ 20 విడుదల ఫిక్స్ చేసుకుని ఆ మేరకు నిన్న అధికారిక ప్రకటన ఇచ్చింది. అల్లరి నరేష్ దీని కోసం చాలా మెకోవరయ్యాడు. పుష్పలో అల్లు అర్జున్ తరహా గెటప్ అనిపించినప్పటికీ లుక్స్, ఇంటెన్సిటీ పరంగా ఇది మరో స్థాయిలో ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా బచ్చల మల్లికి క్లైమాక్స్ కే ప్రధాన ఆయువుపట్టుగా చెబుతున్నారు. ఊహించని ముగింపు ఉంటుందని, అసలు అలా జరుగుతుందని ఎవరూ ఊహించని స్థాయిలో చివరి ఘట్టంని డిజైన్ చేశారని అంటున్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియని బచ్చల మల్లి క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపిస్తుంది అంటున్నారు. పెర్ఫార్మన్స్ అవార్డు స్థాయిగా చెబుతున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో గమ్యం లాంటి ప్రయత్నాలు అల్లరి నరేష్ కు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. మరి బచ్చల మల్లి ఏం చేస్తాడో ఇంకో నెల రోజులు ఆగాలి.
తేదీ అయితే లాక్ చేసుకుంది కానీ బచ్చల మల్లికి తీవ్రమైన పోటీ ఉంది. అదే రోజు హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ పెద్ద క్రేజ్ తో దేశవ్యాప్తంగా వస్తోంది. విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2ని తెలుగులో గీత ఆర్ట్స్ మంచి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. అయిదు రోజుల గ్యాప్ తో నితిన్ రాబిన్ హుడ్ ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకొస్తారు. ఇవి కాకుండా 20నే ప్రియదర్శి సారంగపాణి జాతకంని రిలీజ్ చేస్తున్నారు. ఇంత కాంపిటీషన్ మధ్య అల్లరోడు నెగ్గుకు రావాల్సి ఉంటుంది. మరో సినిమా భైరవం వచ్చే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. బచ్చల మల్లి కనక హిట్ అయితే ఎక్కువ మాస్ కథల వైపు అల్లరి నరేష్ మొగ్గు చూపొచ్చు.
This post was last modified on November 21, 2024 11:26 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…