వరుస హిట్లతో దర్శకుడిగా ఒక స్థాయికి చేరుకున్న అనిల్ రావిపూడి అనుకోకుండా ఇప్పుడు హీరో కూడా దొరకని సిట్యువేషన్‍లో పడ్డాడు. కరోనా బ్రేక్ రాకపోయినట్టయితే ఈపాటికి హ్యాపీగా ఎఫ్ 3 షూటింగ్‍తో బిజీగా వుండేవాడు. కానీ ఆ సినిమా మొదలు పెట్టడానికి మరి కొన్నాళ్లు పడుతుంది కనుక ఈలోగా వేరే చిత్రం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ తను కాంటాక్ట్ చేసిన హీరోల్లో అందరూ కూడా పెండింగ్ ప్రాజెక్టులతో బిజీగా వున్నారట. దీంతో ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలనే డైలెమాలో రావిపూడి వున్నాడని భోగట్టా.
ప్రస్తుతానికి అయితే రామ్ ఒక్కడే తదుపరి చిత్రం ఏదీ ఖాయం చేసుకోలేదు. ఈ కాంబినేషన్‍లో సినిమా రావచ్చుననే టాక్ అయితే వుంది. కాకపోతే రావిపూడి దగ్గర ఒక సీనియర్ హీరోకి సరిపోయే కథ సిద్ధంగా వుందట. అందుకోసం నాగార్జునను సంప్రదిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కానీ నాగార్జున ఇప్పటికే తదుపరి చిత్రాలు యువ దర్శకులతో ఖాయం చేసి పెట్టుకున్నారు.
అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ తెలుసు కనుక నాగ్ అవి వాయిదా వేసుకునే అవకాశమయితే లేకపోలేదు. అనిల్ రావిపూడి మాత్రం ఇలాంటి వార్తలెన్నో తన గురించి మీడియాలో వస్తున్నా కానీ ఇంతవరకు తదుపరి చిత్రం గురించిన అధికారిక ప్రకటన చేయలేదు.
This post was last modified on October 5, 2020 3:56 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…