రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఈ ఘటన రానా చిన్నతనంలో జరిగిందట. చిరు కోపంతో తనను ఒక దెబ్బ వేశాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రానానే స్వయంగా వెల్లడించాడు. చిరు తనయుడు చరణ్, రానా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు.
చిన్నతనంలో తామిద్దరం కలిసి చాలా అల్లరి పనులు చేశామని గతంలోనే రానా వెల్లడించిన సంగతి తెలిసిందే. కిటికీల గ్రిల్స్ తీసేసి మరీ బయటికి వెళ్లేవాళ్లమని.. దీంతో తమ మీద అందరూ ఓ కన్నేసి ఉంచేవారని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రానా తెలిపాడు. తాజాగా చిరు చేతిలో తాను దెబ్బలు తిన్న విషయాన్ని రానా గుర్తు చేసుకున్నాడు.
“చిరంజీవిగారు అందరికీ మెగాస్టార్. కానీ నాకు నా ఫ్రెండు వాళ్ల నాన్న, అంతే. ఎవ్వరైనా చిరును కలవాలని, ఆయన దగ్గరికి వెళ్లాలని తాపత్రయపడతారు. కానీ నేను మాత్రం ఆయన్నుంచి ఎలా తప్పించుకుందామా అని చూసేవాడిని. ఎందుకంటే నేను అల్లరివాడిని. తప్పు చేస్తే ఆయన ఏమంటారో అని భయం.
చిన్నతనంలో ఆయనతో నాకు మరిచిపోలేని సంఘటన అంటే.. ఆయన చేతిలో దెబ్బలు తిన్నదే. ఆయన ఓసారి ఖరీదైన టెలిస్కోప్ తీసుకొచ్చారు. దాన్ని సరిగ్గా సెట్ చేసి అంతా రెడీ చేసి ఇక ఆకాశంలోకి చూడడమే తరువాయి అనుకున్నారు. కానీ నేను ఒక బోల్డ్ ఏదో లాగాను. అది కింద పడి పగిలిపోయింది. అప్పుడు చిరంజీవి గారికి కోపం వచ్చి నన్ను కొట్టారు. కొన్న వస్తువును ట్రయల్ కూడా చూడకుండానే పగలగొట్టేసేసరికి ఆయనకు కోపం వచ్చింది. నేను ఏ వస్తువు విషయంలో అయినా ఇంతే. ఇలాగే కాసేపట్లోనే పగలగొట్టేసేవాడిని” అని రానా వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates