కోలీవుడ్‌కు ‘బాహుబలి’ అవుతుందని.. వెయ్యి కోట్ల వసూళ్లు గ్యారెంటీ అని ‘కంగువ’కు అక్కడి జనాలు ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్ల మాట కూడా అన్నాడు. ఐతే ప్రోమోలు చూస్తే మరీ నిర్మాత చెప్పిన స్థాయిలో కాకపోయినా భారీగానే వసూళ్లు సాధిస్తుందని, పెద్ద హిట్ అవుతుందని అనిపించింది. కానీ తీరా థియేటర్లకు వెళ్లి బొమ్మ చూస్తే దిమ్మ దిరిగిపోయింది.
ఊరికే హడావుడి తప్ప సినిమాలో విషయం లేదని అర్థమైంది. ‘కంగువ’కు తొలి రోజు మిక్స్డ్ టాక్ రాగా.. రాను రానూ అది పూర్తి నెగెటివ్ టాక్‌గా మారిపోయింది. ‘కంగువ’ను ట్రోల్ మెటీరియల్‌గా మార్చేశారు నెటిజన్లు. ఈ సినిమాలో సన్నివేశాల గురించి.. అరుపులు కేకల గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇక వసూళ్ల సంగతి చూస్తే పరిస్థితి దయనీయంగా ఉంది. వీకెండ్లో కూడా సరైన ఆక్యుపెన్సీలు లేవు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమాకు కలెక్షన్లు బాగా పడిపోయాయి. తమిళంలో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. తొలి రోజు వచ్చింది 40 కోట్ల వసూళ్లే కాగా.. పోస్టర్ మాత్రం ఘనంగా రూ.58 కోట్లతో దించేశారు. రెండో రోజు వసూళ్లు నాలుగో వంతుకు పడిపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో కూడా సినిమా గొప్పగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఫుల్ రన్లో సినిమా రూ.100 కోట్ల మార్కును అందుకుంటే గొప్ప అన్నట్లుంది పరిస్థితి.
దీన్ని బట్టి ‘కంగువ’ పెద్ద డిజాస్టర్ కాబోతోందన్నది స్పష్టం. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం సినిమాకు మంచి స్పందన వస్తోందని.. వసూళ్లు నిలకడగా ఉన్నాయని అంటున్నాడు. అంతే కాక ‘కంగువ’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ సినిమా ఆడుతున్న తీరు.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ‘కంగువ-2’ మీద ఆశలు వదులుకోక తప్పదని అర్థమవుతోంది. రిజల్ట్ బాలేని ఏ సినిమాకూ సీక్వెల్ తీసి ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ షూట్ పూర్తయితే చెప్పలేం కానీ.. లేదంటే మాత్రం సీక్వెల్ ఆపేయక తప్పదు.
This post was last modified on November 18, 2024 1:30 pm
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్‌బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…
ఇద్దరు మహిళా నాయకులు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కక ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్…
ఊహలు గుసగుసలదే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశిఖన్నా. ఈ టాలీవుడ్ బ్యూటీ…