టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ హీరో. కానీ రాబోయే సినిమాలతో అతను పాన్ వరల్డ్ హీరో అయిపోతాడనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే తన భవిష్యత్ ప్రాజెక్టుల స్కేల్ మామూలుగా లేదు.
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమాతో ప్రభాస్ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతాడనే అంచనాలున్నాయి. వీరి కలయికలో రాబోతున్న సినిమాను ఇంటర్నేషనల్ సినిమా స్టేటస్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీని ‘స్పిరిట్’లో భాగం చేస్తున్నట్లుగా ఇటీవల జోరుగా ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే.
డాన్ లీ తన సోషల్ మీడియా పోస్టులో ప్రభాస్ ‘సలార్’ పోస్టర్ పెట్టడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే అతను పెట్టింది సలార్ పోస్టర్ అయినా.. నటించేది మాత్రం ‘స్పిరిట్’లో అనే ప్రచారం జరిగింది.
తాజాగా సందీప్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తే ‘స్పిరిట్’లో డాన్ నటించబోతుండడం నిజమే అని తేలిపోయింది. లేటెస్ట్‌గా రామ్ గోపాల్ వర్మతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డిని ‘స్పిరిట్’ అప్‌డేట్స్ కోసం అడిగారు అభిమానులు.
త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని.. అప్‌డేట్స్ కూడా వస్తాయని అన్నాడు సందీప్. డాన్ లీ గురించి చాలా చర్చ జరుగుతోంది కదా, తన గురించి అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారు అని అడిగితే.. త్వరలోనే ఉంటుందని చెప్పాడు. డాన్ లీ తన సినిమాలో నటించని పక్షంలో తన గురించి అడిగితే ఖండించేవాడు సందీప్.
అలా కాకుండా త్వరలోనే అప్‌డేట్ ఉంటుందని అన్నాడంటే ‘స్పిరిట్’లో అతను నటిస్తున్నట్లే భావించాలి. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు సందీప్ ఇంతకుముందే ప్రకటించాడు. లుక్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరులో షూటింగ్ అంటే.. సంక్రాంతికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఆశించవచ్చేమో. డాన్ లీ గురించి కూడా కొంచెం వెనుకో ముందో అప్‌డేట్ ఇచ్చే అవకాశముంది.
This post was last modified on November 18, 2024 1:22 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…