Movie News

కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా?

ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితం గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. ఆమె ప్రేమ.. పెళ్లి గురించి గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి.

ఒక కమెడియన్‌తో ప్రేమ అని.. ఒక సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకోబోతందని.. అలాగే ఒక బిజినెస్‌మ్యాన్‌తో ఆమెకు నిశ్చితార్థం జరగబోతందని.. ఇలా వేర్వేరు సందర్భాల్లో రూమర్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తేలింది.

చివరగా వచ్చిన పెళ్లి రూమర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి పెళ్లి డేట్ కూడా ఫిక్సయిపోయిందని అంటున్నారు. డిసెంబరులో కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతోందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తుండడం విశేషం.

కీర్తి తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమే చేసుకోబోతందని.. వరుడు వారి బంధువే అని అంటున్నారు. డిసెంబరులో గోవా వేదికగా వీరి పెళ్లి జరగబోతోందట. గతంలో తన ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వచ్చినపుడల్లా.. వాటిని ఖండిస్తూ తాను తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పేది కీర్తి.

ఆమె తల్లి మేనక ఒకప్పటి నటి కాగా, తండ్రి సురేష్ నిర్మాత. మేనక.. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘పున్నమినాగు’ సినిమాలో నటించడం విశేషం. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన కీర్తికి మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. బబ్లీ హీరోయిన్ లాగే చూసేవాళ్లు ప్రేక్షకులు.

కానీ ‘మహానటి’తో ఆమె రాత మారిపోయింది. ఆ సినిమాలో అద్భుత అభినయంతో ఆశ్చర్యపరిచిన అక్కడ్నుంచి మంచి పెర్ఫామర్‌గా గుర్తింపు తెచ్చుకుని పెద్ద హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు బహు భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న కీర్తి.. ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందా అన్నది సందేహం.

This post was last modified on November 17, 2024 8:52 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago