Movie News

అల్లు అర్జున్.. టార్గెట్ @ఖాన్ కుంభస్థలం!

జనాల మధ్య చేసుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ ఈవెంట్స్ కల్చర్ అనేది నార్త్ లో మెల్లగా కనుమరుగవుతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ పుష్ప 2తో అక్కడ ప్రకంపనలు సృస్టించేందుకు రెడీ అయ్యాడు. ఫ్యాన్స్ చేసే హడావుడికి భయపడి బాలీవుడ్ ఖాన్ త్రయం ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈవెంట్స్ చేయడం మానేసి ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఇప్పుడు పక్కా ప్లాన్ తో బన్నీ ఆ రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

7 నగరాల్లో సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అయితే పుష్ప రాజ్ తన టార్గెట్ ను డైరెక్ట్ గా 1000 కోట్లకే పెట్టుకున్నాడు, కాబట్టి ఎక్కడా తగ్గకుండా దేశమంతా పుష్ప 2 మేనియా నడిచేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు పుష్ప 2 సినిమా హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జవాన్ సినిమా హిందీలో ఫస్ట్ డే 63.90 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక పఠాన్ 55.70 కోట్లు అందుకుంది. ఆ తరువాత స్త్రీ 53.25 కోట్లతో 3వ స్థానంలో ఉంది. ఇక సౌత్ సినిమాలలో KGF 2 – 52.40కోట్లతో 4వ స్థానంలో ఉండగా, బాహుబలి 10వ స్థానంలో (40.75కోట్లు) ఉంది. హిందీలో టాప్ 2లో బాలీవుడ్ కింగ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలు ఉండడంతో ఇప్పుడు ఆ కుంభస్థలం రికార్డును పుష్పరాజ్ బద్దలు కొట్టగలడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప 2 హడావుడి చూస్తుంటే కచ్చితంగా హిందీ మార్కెట్ లో డామినేట్ చేసేలానే కనిపిస్తున్నాడు. అయితే మొదటి రోజే ఆ డామినేషన్ స్టార్ట్ అవుతుందా లేదంటే మెల్లగా టైమ్ తీసుకొని ఇతర రికార్డులను అందుకుంటాడా అనేది చూడాలి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్ విషయంలో అయితే అసలు తగ్గడం లేదు. వెయ్యి కోట్ల నమ్మకంతోనే గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. మరి పుష్ప 2 ఆ నమ్మకాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి.

This post was last modified on November 17, 2024 8:30 pm

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

45 minutes ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

5 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

5 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

7 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago