తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని, కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో కస్తూరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. “హిందూ మక్కల్ కచ్చి” సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు గొడవ ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ద్రవిడ పార్టీలను విమర్శిస్తూ, తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 300 ఏళ్ల కిందట రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు.. తామే తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో తెలుగు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కస్తూరి ప్రయత్నించినప్పటికీ, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. తాను తెలుగువారిని అవమానించలేదని, ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకతను మాత్రమే ప్రశ్నించానని ఆమె స్పష్టం చేసింది. అయితే, ఈ వివరణ ప్రజలను శాంతింపజేయలేకపోయింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిరస్కరించబడింది. ఈ పరిణామంతో ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచారు. కాగా, ఈ కేసు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కస్తూరి వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
This post was last modified on November 17, 2024 5:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…