ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. ఇందులో నయన్ పేర్కొన్న అంశాలు చూస్తే తప్పంతా ధనుష్‌దే అనిపిస్తుంది. తన డాక్యుమెంటరీలో తాను నటించిన సినిమాల వీడియోలు, ఫొటోలు వాడుకుంటే తప్ప.. దానికి ధనుష్ అడ్డు చెప్పడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలామంది ఈ విషయంలో ధనుష్‌ను తప్పుబడుతున్నారు. కానీ ధనుష్ వెర్షన్ తెలియకుండా అతణ్ని మాత్రమే విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. అతను ఈ విమర్శలు, ఆరోపణలపై ఏమని స్పందిస్తాడో చూడాలి. కానీ ఈ లోపు తన ఫ్యాన్స్ నయన్ మీద కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.
నయనతార భర్త విఘ్నేష్ శివన్‌కు అవకాశమిచ్చి ప్రోత్సహించింది ధనుషే అని అందరికీ తెలుసు. గతంలో విఘ్నేష్ కూడా ధనుష్ పట్ల తన గౌరవ భావాన్ని చాటాడు. ధనుష్ వల్లే తాను నిలబడ్డానని చెప్పాడు. కానీ ఒక దశ దాటాక ధనుష్‌తో అతను అనుచితంగా ప్రవర్తించాడని వాళ్లంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఒక సినిమా నిర్మాతకు దాని మీద సర్వ హక్కులూ ఉంటాయని.. నయన్ కోట్లు పుచ్చుకుని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ హక్కులు ఇచ్చినపుడు.. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నుంచి కంటెంట్ ఉచితంగా ఎలా అడుగుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తన పెళ్లి వీడియోలను కూడా నెట్ ఫ్లిక్స్‌కు అమ్మేసిన కమర్షియల్ హీరోయిన్ నయన్ అని.. అంతే కాక తన సినిమాల ప్రమోషన్లకు కూడా ఆమె ఎప్పుడూ హాజరు కాదని.. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటుందని.. కానీ తన భర్త డైరెక్ట్ చేసిన సినిమాలను మాత్రం ప్రమోట్ చేస్తుందని.. ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించే కమర్షియల్ హీరోయిన్‌గా పేరున్న నయన్.. ధనుష్ పక్కా కమర్షియల్ అని విమర్శించడం, తన నైతికతను ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్ అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 17, 2024 5:47 am
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…