Movie News

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం సందీప్ వంగా సినిమాపైనే ఉంది. స్పిరిట్ అంటూ టైటిల్ తోనే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ ఇచ్చారు. అందులోనూ పోలీస్ క్యారెక్టర్ అనగానే కిక్కు గట్టిగా ఎక్కేసింది. ఇక సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ రావాల్సిన రూమర్స్ అయితే గట్టిగానే వైరల్ అవుతున్నాయి.

రూమర్స్ సౌండ్ ఎంత పెరిగినా కూడా సందీప్ రెడ్డి వంగా అసలు స్పందించడం లేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే సైలెంట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఇప్పుడే రాకపోయినా కూడా షూటింగ్ మొదలుపెట్టేలా అతడు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. అయితే ఈ సినిమాలో సౌత్ కొరియా యాక్టర్ డాన్ లీ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది.

దానికి తోడు ఇటీవల ఈ నటుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించిన ఫోటో పోస్ట్ చేయడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. కానీ అతను సలార్ పిక్ షేర్ చేయడంతో అసలు ఎందులో (సలార్ 2 – స్పిరిట్) ఉన్నాడు? అనే డౌట్ కలిగింది. ఇక రీసెంట్ గా ఈ నటుడికి సంబంధించిన ప్రశ్నలు సందీప్ ఎదుర్కొన్నాడు. హైదరాబాద్ లో సినిమాటిక్‌ ఎక్స్‌పో 2024 కార్యక్రమానికి సందీప్ హాజరయ్యారు.

ఇక అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా, నిజంగా మీ సినిమాలో డాన్ లీ ఉన్నాడా? అని అందరూ అడిగేశారు. ఇక ఆ ప్రశ్నకు సందీప్ ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. అన్నిటికి సమాధానం త్వరలోనే చెబుతాను అంటూ సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సందీప్ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో మళ్ళీ బలమైన క్యూరియసిటీ అయితే పెరిగిపోయింది.

నిజం లేకపోతే అక్కడే ఖండించేవాడు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో దాదాపు డాన్ లీ – డార్లింగ్ కాంబో ఫిక్స్ అయినట్లే అంటూ ఫ్యాన్స్ ఊహల్లో తేలిపోతున్నారు. ఈ కాంబో నిజమైతే మాత్రం సినిమా రిలీజ్ వరకు ప్రమోషన్ కూడా అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే డాన్ లీ రూపం అలాంటిది. అతని ఫిట్నెస్ కూడా స్క్రీన్ హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేయగలదు. ఇక ప్రభాస్ తో ఫైట్ చేస్తే పూనకాలు రావడం గ్యారెంటీ. మరి వంగా ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on November 16, 2024 11:54 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

1 hour ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

1 hour ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

5 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

5 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago