వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 10 కోట్లు కూడా దాటలేకపోయాయి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా కనెక్ట్ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం థియేటర్ వరకు కూడా రప్పించడం లేదు.
గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బడ్జెట్ పరంగా గట్టి సినిమాలే. 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు చేశారు. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఏ ఒక్క సినిమా లెక్క పది కోట్లు దాటలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గాయాన్ని మాన్పించాలి అంటే మట్కా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాల్సిందే.
అసలే సినిమాకు బడ్జెట్ 40 కోట్ల దాటినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత అయితే బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అలాగే మరికొన్ని స్ట్రాంగ్ ఏరియాల రైట్స్ అమ్మేసుకున్నరు. దీంతో లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కానీ వరుణ్ తేజ్ స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే భవిష్యత్తు ఉంటుంది.
1980 బ్యాక్ డ్రాప్ కాబట్టి నటనకు ఎలివేషన్స్ కు పట్టున్న సినిమా. ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ఓపెనింగ్స్ బాగుంటేనే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్లు బాగుంటాయి. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. పరిస్థితి చూస్తుంటే మౌత్ టాక్ సినిమాకు చాలా అవసరమయ్యేలా ఉంది. మరి వరుణ్ తేజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను చూస్తాడో చూడాలి.
This post was last modified on November 13, 2024 5:59 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…